ముస్లిం సామాజిక వర్గానికి మోది విజ్ఞప్తి!
- 9 Views
- admin
- April 29, 2017
- జాతీయం తాజా వార్తలు
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ ఆచారానికి చరమగీతం పాడేందుకు ముస్లిం సామాజికవర్గం సరైన పరిష్కారాన్ని కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. బస్వ పర్వదినం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ‘ ఈ దురాచారం నుంచి ముస్లిం మహిళలను కాపాడేందుకు ఆ సామాజిక వర్గం ప్రజలు ముందుకువస్తారని నేను నమ్ముతున్నాను’ అని తెలిపారు. దేశంలో ఎలాంటి వివక్షకు తావులేదని, ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ అన్నదే ప్రభుత్వ సిద్ధాంతమని, ప్రజల పట్ల ఎలాంటి వివక్ష చూపకుండా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదని చెప్పారు. ప్రధానమంత్రి ముద్ర యోజనకు మంచి ప్రతిస్పందన వస్తున్నదని, తమ చిన్నతరహా వ్యాపారాల కోసం దేశంలోని 70శాతం మంది మహిళలు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని తెలిపారు.
Categories

Recent Posts

