న్యూయార్క్: తనంతటతానే ఇన్సులిన్‌ను ఉత్పత్తిచేసే కృత్రిమ క్లోమాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. టైప్-1 మధుమేహంతో బాధపడే పిల్లల్లో ఈ క్లోమంతో రక్తంలోని చక్కెరస్థాయిని సమర్థంగా నియంత్రించవచ్చని తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్థులు తరచూ రక్తంలోని చక్కెరస్థాయిలను గమనించి, ఇన్సులిన్‌ను ఎక్కించుకోవాల్సిన అవసరం ఇక ఉండదని అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. రోగి ధరించిన ఇన్సులిన్ పంప్, రక్తంలోని చక్కెరస్థాయిని గమనించే మానిటర్‌ను శాస్త్రవేత్తలు వైర్లెస్ సిగ్నళ్ల ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించారు. మధుమేహ వ్యాధిగ్రస్థులు, 5 నుంచి 8 ఏండ్ల పిల్లల్లో తనంతటతాను ఇన్సులిన్‌ను ఉత్పత్తిచేసే కృత్రిమ క్లోమం సమర్థంగా, సురక్షితంగా పనిచేసినట్లు తాము నిర్వహించిన పరిశోధనలో తేలిందని చెప్పారు. ఐదు నుంచి ఎనిమిదేండ్ల వయసున్న 12 మంది మధుమేహ పిల్లలపై 68 గంటలపాటు కృత్రిమ క్లోమం సాయంతో చక్కెరస్థాయిని పరిశీలించారు. కృత్రిమ క్లోమం ఉపయోగించినపుడు పిల్లల్లో రక్తంలోని సగటు చక్కెరస్థాయిలు తక్కువగా ఉన్నాయని, హైపోైగ్లెసీమియా కూడా పెరుగలేదని వివరించారు.
కృత్రిమ క్లోమంతో పిల్లల్లో మధుమేహ నియంత్రణ
- 18 Views
- admin
- April 30, 2017
- అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
Categories

Recent Posts

