పవన్ కల్యాణ్ మంచోడు..రాజకీయాలకు పనికి రాడు: మంత్రి సోమిరెడ్డి
- 13 Views
- admin
- April 30, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంచి మనిషని, కానీ, రాజకీయాలకు అంతగా పనికిరాడని తన అభిప్రాయమని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘పవన్ కల్యాణ్నేను పెట్టుబడులు పెట్టలేను..ఎన్నికల్లో గెలుస్తానో లేదో తెలియదు అని అంటుంటారు.ఇది పొలిటీయన్ కు పనికి రాదు. స్ట్రాంగ్ గా ఉండాలి. మనిషి మంచివారు..ప్రజల మంచి కోరుకుంటారు… పవన్ ఇచ్చిన సలహాలను అవసరమైతే తమ ప్రభుత్వం కూడా స్వీకరిస్తోంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి పవన్ కల్యాణ్ ఎప్పుడూ విమర్శించలేదు. ఎక్కడైనా తప్పులుంటే పవన్ చెబుతున్నారు..దాని వల్ల సంబంధిత మంత్రి, శాఖ యాక్టివ్ అవుతున్నారు. ఏదేమైనా, పవన్ కల్యాణ్ గారు లోపలొకటి పెట్టుకునే వ్యక్తి కాదు .. స్ట్రాటజిస్ట్ అయితే కాదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఏమవుతుందో చూస్తాము’ అని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
రెడ్డిని రెడ్డే తిట్టాలన్న నిబంధనేదీ టీడీపీలో లేదు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల్లో నుంచి బయటపడే ప్రసక్తే లేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జగన్ పై అడిషనల్ ఛార్జి షీట్ సహా పన్నెండు కేసులు ఉన్నాయని, ఈ కేసులన్నింటికీ సంబంధించి ఆధారాలు ఉన్నాయని, వీటి నుంచి బయట పడటమనే ప్రసక్తే లేదని అన్నారు. తాను ఎవరినీ ఎదగనీయననే మాటల్లో ఎటువంటి వాస్తవం లేదని, ఆ కల్చర్ టీడీపీలో లేదని, తనకు మంత్రి ఇవ్వొద్దని నెల్లూరులో ఎవరూ వ్యతిరేకించలేదని, జగన్ ను తిట్టేందుకే తన కెరీర్ పరిమితం కాలేదని, రెడ్డిని రెడ్డే తిట్టాలన్న నిబంధనేదీ టీడీపీలో లేదని ఆయా ప్రశ్నలకు సమాధానాలుగా సోమిరెడ్డి చెప్పారు.
ఇప్పుడు గాంధీ మహాత్ముడు వచ్చి డబ్బు లివ్వను, బ్రాందీ ఇవ్వనన్నా కుదరదు: మంత్రి సోమిరెడ్డి
గత ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవడానికి కారణాలు ఏంటని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ని ఓ న్యూస్ ఛానెల్ ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రోజులు పోయాయని, ఇప్పుడు గాంధీ మహాత్ముడు వచ్చి పోటీ చేసి.. తాను డబ్బులు ఇవ్వననో లేకపోతే బ్రాందీ ఇవ్వననో అని అంటే గెలిచే పరిస్థితులు లేవని, ప్రస్తుతం ఎన్నికల ఖర్చు తప్పదని అన్నారు.
తమ ప్రాంతంలో ఓటు బ్యాంకు డిఫరెంట్ గా ఉందని, ప్రో-కాంగ్రెస్, ప్రో-జగన్ ఉన్నారని అన్నారు. తాను ఓడినా, గెలిచినా తన లైఫ్ స్టైల్ లో తేడా ఉండదని, ప్రతిపక్షంలో దేనిమీద అయితే పోరాడానో, అధికారంలోకి వచ్చాక వాటిని కరెక్ట్ చేస్తానని, 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నా, పార్టీ ఒత్తిడి మేరకు పోటీ చేయాల్సి వచ్చిందని, ఉప ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే పోటీ చేయాల్సి వచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానంగా సోమిరెడ్డి చెప్పారు.
తమ ప్రాంతంలో ఓటు బ్యాంకు డిఫరెంట్ గా ఉందని, ప్రో-కాంగ్రెస్, ప్రో-జగన్ ఉన్నారని అన్నారు. తాను ఓడినా, గెలిచినా తన లైఫ్ స్టైల్ లో తేడా ఉండదని, ప్రతిపక్షంలో దేనిమీద అయితే పోరాడానో, అధికారంలోకి వచ్చాక వాటిని కరెక్ట్ చేస్తానని, 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నా, పార్టీ ఒత్తిడి మేరకు పోటీ చేయాల్సి వచ్చిందని, ఉప ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే పోటీ చేయాల్సి వచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానంగా సోమిరెడ్డి చెప్పారు.
Categories

Recent Posts

