న్యూయార్క: అమెరికాలో భారత సంతతికి చెందిన బామ్మను, మనుమరాలిని హత్య చేసిన టెకీ రఘునందన్ యండమూరికి విధించిన మరణశిక్షను పెన్సిల్వేనియా హైకోర్టు శుక్రవారం ధృవీకరించింది. సత్యవతి వెన్న (61), ఆమె మనుమరాలు సాన్వి వెన్నను ఆ కుటుంబానికి సన్నిహితుడైన రఘునందన్ హత్యచేయడం అప్పట్లో సంచలనం కలిగించింది.
పెన్సిల్వేనియాలో 2012లో జూదపు సొమ్ము కోసం ముందుగా వారిని కిడ్నాప్ చేయబోయి తడబాటులో హత్యచేసిన రఘునందన్‌కు 2015లో దిగువకోర్టు మరణశిక్ష విధించింది. ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం ఆ శిక్షను ధ్రువీకరించినప్పటికీ పెన్సిల్వేనియాలో మరణశిక్షల అమలుపై రాష్ట్రవ్యాప్త నిషేధం ఉన్నది. హత్యలపై ముందుగా బుకాయించిన రఘునందన్ పోలీసుల ఇంటరాగేషన్‌లో నేరం అంగీకరించాడు.
భారత టెకీకి మరణదండన సబబే
- 20 Views
- admin
- April 30, 2017
- అంతర్జాతీయం తాజా వార్తలు
Categories

Recent Posts

