500 నోటు అచ్చుతప్పు
- 15 Views
- admin
- April 30, 2017
- జాతీయం తాజా వార్తలు

భోపాల్: నిత్యవసర సరుకుల కొనేందుకు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం కేంద్రానికి వెళ్లిన వ్యక్తికి కొత్త 500 రూపాయల నోట్లు నకిలీవి రావడంతో షాక్ తిన్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మోరేనాలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు గోవర్ధన్ శర్మ నేటి ఉదయం డబ్బులు డ్రా చేసుకునేందుకు మోరెనాలోని ఏ ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. డబ్బు డ్రా చేసిన తర్వాత షాక్ తినడం అతడి వంతయింది. ఏటీఎం నుంచి వచ్చిన రూ.500 నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మ ముద్రించి లేకపోవడంతో నకిలీ నోట్లు అని గుర్తించి తాను మోసపోయానని గ్రహించాడు.ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు తాను డ్రా చేసిన నోట్లను చూపించి అసలు విషయాన్ని చెప్పాడు. అతడు ఏటీఎంలో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేశాడు. వెంటనే ఎస్బీఐ అధికారులు కొందరు ఏటీఎం వద్దకు వచ్చి నోట్లను పరిశీలించారు. అవి నకిలీ నోట్లు కాదని, అయితే ఆ నోట్లపై గాంధీజీ బొమ్మను ముద్రించడం మరిచిపోయారని వివరణ ఇచ్చుకున్నారు. ఆ నోట్లను తిరిగి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు పంపిస్తామని ఆ ఎస్బీఐ ఉద్యోగి వివరించారు.
Categories

Recent Posts

