ఆరడుగుల బుల్లెట్ రెడీ
- 26 Views
- admin
- May 1, 2017
- తాజా వార్తలు సినిమా
గోపీచంద్- బి.గోపాల్‌ల కాంబినేషన్లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ఆరడుగుల బుల్లెట్. ఈ చిత్రానికి తాండ్ర రమేష్ నిర్మాత. గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను మే 19న విడుదల చేసేం దుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లా డుతూ ”ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్, మాస్ ఆడి యన్స్‌కు నచ్చే అంశాలు మేళవించి దర్శకులు బి.గోపాల్ ”ఆరడుగుల బుల్లెట్” చిత్రాన్ని తెరకెక్కిం చారు. ప్రముఖ రచయితలు వక్కంతం వంశీ అందించిన కథ, అబ్బూరి రవి మాటలు, బాల మురుగన్ సినిమా టోగ్రఫీ సినిమాకి హైలైట్స్‌గా నిలుస్తాయి. గోపీచంద్ కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ”ఆరడుగుల బుల్లెట్”ను మే 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాం.” అన్నారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, అభిమన్యు సింగ్, చలపతిరావ్, సలీం బేగ్, ఉత్తేజ్, జయప్రకాష్ రెడ్డి, రమాప్రభ, సురేఖావాణి, సన, మధునందన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: వక్కంతం వంశీ, నిర్మాత: తాండ్ర రమేష్, దర్శకత్వం: బి.గోపాల్