గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయేది తమ ప్రభుత్వమేనని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఎంతో దూరంలో లేదని.. మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని కార్మికులకు భరోసా ఇచ్చారు. గుంటూరు బస్టాండ్‌లో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొన్న జగన్.. ఆ పార్టీ కార్మిక సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఆర్టీసీని కేశినేని, దివాకర్‌కు.. విద్యాలయాలను నారాయణ సంస్థకు, విద్యుత్ ప్రాజెక్టులను సుజనాచౌదరికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.