విమానాశ్రయం నామకరణంపై కేంద్రంతో చర్చిస్తా : ఎంపీ హరిబాబు
- 20 Views
- admin
- May 1, 2017
- తాజా వార్తలు స్థానికం
మాధవధార, ఫీచర్స్ ఇండియా : విజయనగరం జిల్లా భోగాపు రంలో నిర్మించనున్న అంతర్జా తీయ విమానాశ్రయానికి సింహ ద్రి అప్పన్న పేరు పెట్టాలన్న విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, చర్చించనున్న ట్లు విశాఖ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కంభం పాటి హరిబాబు హామీ ఇచ్చారు. విమానాశ్రయానికి సింహాద్రి అప్పన్న పేరు పెట్టేందుకు సహకరించాలని కోరుతూ మాధవ ధారకు చెందిన సింహాద్రి అప్పన్న ప్రచార సమితి సమాఖ్య సభ్యులు, ఎంపీ హరిబాబుకు వినతి ప్రత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య సభ్యులు చేస్తోన్న ప్రయత్నం అభినందనీయమని అన్నారు. ఈ విషయమై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాల దృష్టికి తీసుకెళ్లి చర్చించనున్నట్లు సభ్యులకు తెలిపారు. ఎంపీ ని కలిసిన వారిలో సమాఖ్య సభ్యులు చౌదరి కళ్యాణ్‌కుమార్, సనపల నారాయణస్వామి, రామన్న, సత్యన్నారాయణ, ఎస్ రవికుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ గుర్తింపు ఎన్నికల ప్రచారం ప్రారంభం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్లో పనిచేస్తున్న ఉద్యో గ-కార్మి కుల గుర్తింపు యూనియ న్కు ఈనెల 9న జరగను న్న ఎన్నికలకు సంబం ధించి బీజేఎం ఎం అను బంధ యూనియన్ ప్రచా రాన్ని ప్రారంభించింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగం గా గంట గుర్తుపై పోటీ చేస్తున్న వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధినేత వామన రావుకు తమ యూనియన్ సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు బీజేఎంఎం అనుబంధ యూనియన్ అధ్యక్షులు బుగత వెంకట నారాయణ తెలిపారు. సోమవారం ఉదయం 6.30గం||లకు వెంకటనా రాయణ తమ యూనియన్ సభ్యులతో కలిసి జోన్-1లో ఉన్న సుయాజ్ఫామ్ నందు, 1, 2, 3 వార్డుల్లో కార్మికులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ గంట గుర్తుపై ఓటేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశానికి హాజరైన డ్రైవర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, అధిక సంఖ్యలో పనివారు పాల్గొని తమ మద్ధతు ప్రకటించారు. ఈసందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయడమేకాకుండా ప్రతీ ఉద్యోగికి 960చ|| అడుగుల్లో రూ.6లక్షలతో ఇళ్లు నిర్మాణం, 010 పద్దు కింద ఉద్యోగులకు జీతాలు చెల్లింపు, కార్మికులందరికీ ప్రభుత్వ హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు యూనియన్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారంలో బోని సత్యన్నారాయాణ, ఎన్ భైరాగిరాజు, జీకే రెడ్డి, ముగడ రాజు, బి. లక్ష్మణరావు, జె రాము, వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుద్ఘాతానికి గిరిజన యువకుడు బలి
దేవరాపల్లి, ఫీచర్స్ ఇండియా : విద్యుద్ఘాతానికి ఓ గిరిజన యువకుడు బలయ్యాడు. మండలంలో తానురబ్బ పంచాయితీ శివారు కొత్తబొడ్డపాకు గ్రామానికి చెందిన మొసలి సింహాద్రప్పడు(35) యధా విధిగా పామాయిల్ గెలలు కోసేందుకు తోటకు వెళ్లాడు. గెలలు కోస్తోన్న క్రమంలో కత్తి, విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అక్కడే పనిచేస్తోన్న మొసలి పోతురాజు, మరిడయ్యలను వెంటనే ప్రైవేట్ వాహనంలో తరలిస్తుండగా, మార్గ మధ్యలోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఘటనా స్థలానికి చేరుకొన్న రవి, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తోట యజమాని విద్యుత్ తీగలు సరిచేయించకుండా, అజాగ్రత్తగా ఉండటం వల్లే సింహాద్రప్పడు మృతిచెందాడని ఆరోపించారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.