విశాఖ బీచ్లో స్కూలు బస్సు బీభత్సం.. ఒకరు మృతి.. అడిషనల్ ఎస్పీకి గాయాలు
- 11 Views
- admin
- May 1, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం

కారణాలు పూర్తిగా తెలియలేదు: కమిషనర్
బస్సు అదుపుతప్పడానికి గల కారణాలు తెలియలేదని పోలీసు కమిషనర్ యోగానంద్ సంఘటన స్థలంలో పేర్కొన్నారు. ప్రమాద వార్త తెలియగానే సిపి హుటాహటిన ఘటనాస్థలికి విచ్చేశారు. పరిస్థితులను పరిశీలించారు. క్షతగాత్రుల వైద్య సేవలపైనా ఆయన ఆరా తీశారు.
తప్పిన పెను ప్రమాదం..:ప్రమాద ఘటనకు సమీపంలోని ఒక హోటల్లో ఆదివారం రాత్రి జరిగిన ఒక వేడుకకు ఇదే బస్సులో విద్యార్థులను తీసుకువచ్చారు. కార్యక్రమం పూర్తిఅయ్యే సమయంలో తిరిగి విద్యార్థులను తరలించేందుకు బస్సును సిద్ధం చేసే ప్రయత్నంలోనే బస్సు అదుపు తప్పినట్లుగా భావిస్తున్నారు. ఈ కారణంగానే పాఠశాల బస్సులో డ్రైవర్ ఒక్కరే ఉన్నాడు. లేకుంటే ప్రమాద తీవ్రత మరింతగా ఉండేది.
Categories

Recent Posts

