ఉత్సాహంగా ఊర్జ-సీఏపీఎఫ్ ఫుట్‌బాల్ టోర్నీ
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : ఊర్జ, సీఏపీఎఫ్ అండర్ 19 ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ టోర్నమెంట్ రెండో రోజు ఆటలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జిఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ జట్లు విజయపథంలో దూసుకుపోయాయి. ఎస్జి.ఎఫ్.ఐ. బాలికలు, బాలుర జట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) బాలబాలికల జట్లుపై గెలుపొందాయి. నేవీ గ్రౌండ్లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. తొలి రోజు తడబడిన కేవీఎస్ బాలికల జట్టు రెండో రోజున నిలకడగా ఆడింది. ఎస్.జి.ఎఫ్.ఐ. ఏపీ వన్ బాలికల జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది. మొదటి రోజు వైఫల్యాలను సరిదిద్దుకుని చక్కటి ఆటను కేవీఎస్ బాలికలు ప్రదర్శించారు. రెండు గోల్ పోస్టుల వద్ద హోరా హోరీగా బాలికల జట్లు ఢీకొన్నాయి. సోమవారం సాయంత్రం బాగా పొద్దు పోయేంత వరకు ఆడినప్పటికీ మంగళవారం ఉదయానికి కేవీఎస్ బాలికలు సర్వసన్నద్దమయ్యారు. ఫుట్‌బాల్‌లో అంతగా అనుభవం లేనప్పటికీ ప్రత్యర్ధి జట్టును నిలువరించడంతో కేవీఎస్ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో మాధిరిగానే రెండో మ్యాచ్‌లో కూడా కేవీఎస్ జట్టు గాయాలు వెంటాడాయి. పలువురు క్రీడాకారిణులు గాయాలకు గురయ్యారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఎంతో ఆత్మ విశ్వాసంతో ఆట ఆడి అందర్నీ మెప్పించారు. మొదటి మ్యాచ్‌లో ఒక్క గోల్ చేయలేని కేవీఎస్ వన్ జట్టు మంగళవారం నాటి మ్యాచ్‌లో ఒక గోల్ చేసి ఆ జట్టులో ఆత్మ విశ్వసాన్ని పెంచింది. ఆట ద్వితీయార్ధంలోని 59వ నిమిషంలో కేంద్రీయ విద్యాలయ శ్రీ విజయనగర్ విద్యార్ధిని యశశ్వణి గోల్ చేసి కేవీఎస్ జట్టుకు మొట్టమొదటి పాయింట్‌ను అందజేసింది. ఆట ప్రథమార్ధంలో ఈ క్రీడాకారిణి తీవ్ర గాయానికి గురయ్యింది. అయినప్పటికీ చక్కటి ఆటతో గోల్ చేసి అందరి మన్ననలు అందుకుంది. కేవీఎస్ వన్ బాలికల జట్టు వరుసగా రెండవ రోజు కూడా బలమైన జట్టును ఢీ కొంది. ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ వన్ జట్టుతో తొలి మ్యాచ్‌లో తలపడిన కేవీఎస్ వరుసగా రెండవ రోజు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ జట్టును ఎదుర్కొంది. ఈ రెండు జట్లు ఫుట్‌బాల్‌లో చాలా బలంగా ఉండటంతో కేవీఎస్‌కు ఇబ్బందులు తప్పలేదు. ఎస్.జి.ఎఫ్.ఐ. వన్ జట్టు బాలికల్లో పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ముఖ్యంగా స్కూల్ గేమ్స్‌లో మీట్లో ఈ క్రీడాకారిణులు పాల్గొంటున్నారు. రసవత్తరంగా సాగిన రెండో రోజు తొలి మ్యాచ్‌లో ఆట ప్రారంభమైన తొమ్మిదవ నిమిషంలో టి.రమ్య గోల్ చేసింది. ఆ తరువాత ఆట ప్రథమార్ధంలో మరో గోల్ పడలేదు. ద్వితీయార్ధంలో జె.భూమిక, ఎన్. అనురాధ వరుసగా 70, 77 నిమిషాలలో గోల్స్ చేశారు. అదే సందర్భంలో కేవీఎస్ వన్ క్రీడాకారిణి యశశ్వణి 59వ నిమిషంలో గోల్ చేసింది. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కేవీఎస్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఎస్.జి.ఎఫ్.ఐ. ఏపీ వన్ జట్టు 3 0 గోల్స్ తేడాతే విజయం నమోదు చేసుకుంది.
ఎస్.జి.ఎఫ్.ఐ. ఏపీ వన్ జట్టు ఫార్వర్డ్ ఆడుతున్న టి.రమ్య మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో తొలి గోల్ చేయడం సంతోషంగా ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు, పల్లంట్ల గ్రామానికి చెందిన తాను పదవ తరగతి చదువుతున్నానని, నాలుగేళ్లుగా ఫుట్‌బాల్ ఆడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 12 పోటీలలో పాల్గొన్న రమ్య, ఇటీవల బీహార్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నట్లు చెప్పారు.
ఎస్.జి.ఎఫ్.ఐ. ఏపీ వన్ జట్టులో రైట్ ఆవుట్ ఆడుతున్న భూమిక మాట్లాడుతూ, ఈ విజయం తమలో ఎంతో ఉత్సాహాన్ని నింపిదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పల్లంట్ల గ్రామానికి చెందిన భూమిక కూడా నాలుగేళ్లుగా ఫుట్‌బాల్ ఆడుతున్నట్లు తెలిపారు. ఇంత వరకు 12 రాష్ట్ర స్థాయి, మరో రెండు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నట్లు చెప్పారు. ఊర్జా టోర్నమెంట్లో విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తానని తెలిపారు.
ఇదే జట్టులో ఫార్వర్డ్ ఆడుతున్న అనురాధ ఆట చివరి నిమిషంలో గోల్ చేశారు. విజయనగరం జిల్లా రాయవలస గ్రామా నికి చెందిన అనురాధ మాట్లాడుతూ, మణిపూర్, బీహార్, బల్లారి తదుతర ప్రాంతాలలో జరిగిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ మీట్ సహా పలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్నట్లు తెలిపారు. ఊర్జ టోర్నీ మరింత జోష్ నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండవ రోజు రెండవ మ్యాచ్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.జి.ఎఫ్.ఐ) ఏపీ వన్ బాలుర జట్టు, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) వన్ బాలుర జట్టు తలపడ్డాయి. టోర్నమెంట్లో పసికూనలైన కేవీఎస్ వరుసగా రెండవ రోజు కూడా వైఫల్యం చెందింది. పటిష్టమైన ఎస్.జి.ఎఫ్.ఐ. ఏపీ వన్ బాలుర జట్టు మొదటి నుంచి దూకుడుగా ఆడింది. ఆట ప్రథమార్ధంలో 23వ నిమిషంలో సిచ్. మస్తాన్‌రావు గోల్‌తో ఈ జట్టు ఖాతా తెరిచింది. ద్వితీయార్ధంలో జె.సుధాకర్ 55వ నిమిషంలో, ఎస్.మధు 66వ నిమిషంలో, సీఫెన్ సత్య 69వ నిమిషంలో గోల్చ్ చేశారు. దీంతో నాలుగు గోల్స్ తేడాతో కేవీఎస్ వన్ పై ఎస్.జి.ఎఫ్.ఐ. విజయం సాధించింది. ఈ జట్టులో కూడా రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. చక్కటి ఆటను ఎస్.జి.ఎఫ్.ఐ. వన్ జట్టు ప్రదర్శించింది.
మహా విశాఖ మరో జాతీయ టోర్నమెంటుకు వేదికైంది.
ఊర్జ 2017 సిఎపిఎఫ్ అండర్-19 ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ పోటీలను విశాఖలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ పోటీల్లో 5 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి సిఐఎస్ఎఫ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. అలాగే విశాఖ సిఐఎస్‌ఎఫ్‌కు చెందిన పురుషులు, మహిళల విభాగాల్లో క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ టోర్నీకి ప్రముఖ ఐపిఎస్ అధికారి ఆనంద మోహన్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విశాఖ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జివిఎంసి కమిషనర్ హరినారాయణ, ఎంపీలు హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పోలీసు అధికారులు, ఆంధ్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ అధికారులు, ప్రముఖ పబ్లిక్ రంగసంస్థలైన హెచ్‌పిసిఎల్, సింహాద్రి పవర్ ప్రాజెక్టు వంటి సంస్థల నుండి అధికారులు పాల్గొన్నారు.

మంగళవారం నాటి పోటీలను ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డి.వి.రెడ్డి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఐఎస్ఎఫ్ కమాండెంట్ ఇర్ఫాన్ అహ్మాద్ ప్రారంభించారు. డి.వి.రెడ్డిగా సుపరిచుతులైన దల్లి వెంకట రెడ్డి విశాఖ వాసి. జాతీ య స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకా రుడు. 82 ఏళ్ల డి.వి.రెడ్డి. 1966,67,68 సంవత్సరాలలో వరుసగా మూడేళ్లు భారత ఫుట్‌బాల్ జట్టు ప్రాతినిథ్యం వహించారు. సర్వీసెస్ జట్టుకు చాలా కాలం ఆడారు. అయిదు పర్యాయాలు సంతోష్ ట్రోఫీలో పాల్గొన్నారు. దురంత్ కప్, డీసీఎం ట్రోఫీ, ఐఎఫ్సి కోల్కత్త తదితర టోర్నమెంట్లకు చాలా కాలం ఆడారు. పోలీసు జట్టుకు దశాబ్దన్నరపాటు కోచ్‌గా వ్యవ హరించిన ఆయన ప్రస్తుతం ఆంధ్రా యూనివర్శిటీ జట్టుకు కోచ్‌గా ఉన్నారు. 30 ఏళ్ల పాటు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తిం చారు. గోల్ కీపర్‌గా ఎంతో గుర్తింపు పొందారు. రెండుసార్లు రాష్ట్రపతి మెడల్స్ అందుకున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, జనరల్ కరియప్ప వంటి ప్రముఖులు చేతుల మీదుగా ట్రోఫీలను అందుకున్నారు. ఫుట్‌బాల్ క్రీడకు ఎంతో వన్నె తెచ్చిన డి.వి.రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఈ మహా యజ్జం ఫలప్రథమ వుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఫుట్‌బాల్‌లో బాలికలు, మహిళల చాలా తక్కువ మంది ఉన్నారని, ఊర్జ టాలెంట్ హంట్‌తో ఆ లోటు భర్తీ అవుతుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ టాలెంట్ హంట్ దేశ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనని అన్నారు.