కొరియా సంక్షోభం
రెండవ ప్రపంచ యుద్ధానంతర రాజకీయాల మూలంగా కొరియా ద్వీపకల్పం ఉత్తర కొరియా, దక్షిణ కొరియాగా విడిపోయింది. ఉత్తర కొరియా సోవియెట్ యూనియన్ (చైనా) ప్రాబల్యంలో ఉంటే, దక్షిణ కొరియా అమెరికా కూటమి చేతిలో ఉన్నది. ఈ సందఠంగా సాగిన యుద్ధంలో ఇరవై లక్షల మంది మరణించారు. ఇప్పుడు నాటో, చైనా మధ్య ప్రాబల్యం కోసం సాగుతున్న పోరాటంలో మళ్ళా కొరియా ద్వీపకల్పం సంక్షోభంలో పడ్డది. ఇటీవల అమెరికా దక్షిణ చైనా సముద్రంలోని చిన్న దేశాలను చేరదీసి, అక్కడ తన బలగాలను పెంచి చైనాను దెబ్బకొట్టాలని ప్రయత్నించింది.
ప్రఛన్నే యుద్ధం ముగిసిందనుకున్న తరువాత కూడా కొరియా ద్వీపకల్పం మళ్ళా సంక్షోభానికి కేంద్ర బిందువు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఉత్తరకొరియా శనివారం జరిపిన క్షిప ణి పరీక్ష విఫలమైందని తెలుస్తున్నది. అయినా సరే, తమ అణుపాటవాన్ని గరిష’ స్థాయికి పెంచుకోవడానికి అణ్వస్త్ర పరీక్షలు సాగిస్తూనే ఉంటామని ఉత్తరకొరియా సోమవారం ప్రకటించింది. ఉత్తర కొరియా అణ్వస్త్ర, క్షిపణి కార్యక్రమాలు కొనసాగిస్తే, ఆ దేశంతో భారీ, భారీ ఘర్షణ జరుగవచ్చునని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల అఫాెనిస్థాన్పై అతి పెద్ద బాంబు వేయడం కూడా పరోక్షంగా ఉత్తరకొరియాను హెచ్చరించడానికే అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా విమాన వాహక యుద్ధ నౌక- యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ ఇతర బలగాలతో ఇప్పటికే కొరియా ద్వీపకల్ప తీర జలాలకు చేరి, దక్షిణకొరియా సైన్యాలతో విన్యాసాలు సాగిస్తున్నది. జపాన్ నౌక కూడా అమెరికా విమాన వాహక నౌకకు రక్షణగా రంగంలోకి దిగింది. ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్ నావికా బలగాలు ఇప్పటికే జపాన్ దళాలతో విన్యాసాలు జరుపుతున్నాయి. అమెరికా దాడికి దిగినప్పుడు ఇతర నాటో దళాలను కూడా రంగంలోకి దింపగలదు. ఉత్తర కొరియాకు చైనా అండగా ఉంటుందనేది తెలిసిందే. ఉత్తర కొరియా సరిహద్దు సమీపాన చైనా లక్షా యాభైవేల సైన్యాన్ని మోహరించింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తత పెరిగితే, పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఉత్తర కొరియా దాడులను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ కొరియాలో క్షిపణి నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయడం పట్ల కూడా చైనా తీవ్ర నిరసన తెలిపింది.
ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించిన తరువాత కూడా ఉత్తర కొరియా అతి వేగంగా క్షిపణి వ్యవస్థను వ ద్ధి చేసుకుంటూనే ఉన్నది. ఇప్పటి వర కు మధ్య తరహా క్షిపణులను తయారుచేసుకున్నద నీ, త్వరలో ఖండాంతర క్షిపణులను కూడా రూపొందించే క షిలో ఉన్నదని తెలుస్తున్నది. అయితే అంత పెద్ద క్షిపణులను తయారుచేసి అమెరికాపై దాడి చేయడం అనూహ్యమే. పూర్తిస్థాయి అణ్వాయుధ, క్షిపణి వ్యవస్థను నిర్మించుకోవడం, అదీ అమెరికాపై దాడి చేసే స్థాయికి ఎదుగడం ఆచరణలో అంత సులభం కాదు. కనీసం యూరప్ దేశాలపై కూడా ఉత్తర కొరియా దాడి జరుపలేదు. అయితే అమెరికా బలహీనత ఏమిటో ఉత్తర కొరియాకు, ఆ దేశానికి మద్దతు ఇస్తున్న చైనాకు తెలు సు. అఫాెనిస్థాన్, ఇరాక్, లిబియా, సిరియా- ఇట్లా నాటో దాడులకు గురైన దేశాలలో ఇంకా పోరాటా లు సాగుతూనే ఉన్నాయి. యుద్ధాలు ముగియలే దు, నాటోకు విజయం సమకూరలేదు. ఉత్తర కొరియా పై దాడి జరిగితే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండదు. తూర్పు ఆసియాలో సుదీరె యుద్ధం అనే క అనర్థాలకు దారి తీస్తుంది. ఉత్తర కొరియా తనపై దాడి మొదలైతే తక్షణం దక్షిణ కొరియాపై దాడులు సాగిస్తుంది. దక్షిణ కొరియా అమెరికాకు వాణిజ్య ప్రయోజనాలు గల దేశం. నాటో దేశాలు రంగంలోకి దిగినా సరే, చైనా మద్దతు ఉన్నంతవరకు ఉత్తర కొరియాను లొంగదీసుకోలేవు. దక్షిణకొరియా అమెరికా మిత్రదేశమే అయినప్పటికీ, ఆ దేశంలో ప్రజలలో అమెరికా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది. దరిదాపులనే ఉన్న జపాన్, ఆస్ట్రేలి యా మొదలైన దేశాలపై యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దక్షిణ పసిఫిక్ సముద్రంలో, జపాన్‌కు ఆవల ఉన్న గువామ్ దీవిలోని అమెరికా స్థావరంపైనా దాడి జరుగుతుంది. అంటే అమెరికా ప్రధాన భూభాగంపై దాడి జరుపలేకపోయినా ఉత్తర కొరియా అమెరికా ప్రయోజనాలకు నష్టం జరుపగలదు. అమెరికా ఎంతకూ తెగని మరో యుద్ధంలో కూరుకుపోవాలనే చైనా పథకం నెరవేరుతుంది. ఉత్తర కొరియా దుందుడుకు వైఖరితో తనకు సంబంధం లేదని చైనా అంటున్నది. కానీ చైనా పథకంలో భాగంగానే ఉత్తరకొరియా ఉరుకులాడుతున్నది.
రెండవ ప్రపంచ యుద్ధానంతర రాజకీయాల మూలంగా కొరియా ద్వీపకల్పం ఉత్తర కొరి యా, దక్షిణ కొరియాగా విడిపోయింది. ఉత్తర కొరియా సోవియెట్ యూనియన్ (చైనా) ప్రాబల్యంలో ఉంటే, దక్షిణ కొరియా అమెరికా కూటమి చేతిలో ఉన్నది. ఈ సందఠంగా సాగిన యుద్ధంలో ఇరవై లక్షల మంది మరణించారు. ఇప్పుడు నాటో, చైనా మధ్య ప్రాబల్యం కోసం సాగుతున్న పోరాటంలో మళ్ళా కొరియా ద్వీపకల్పం సంక్షోభంలో పడ్డది. ఇటీవల అమెరికా దక్షిణ చైనా సముద్రంలోని చిన్న దేశాలను చేరదీసి, అక్కడ తన బలగాలను పెంచి చైనాను దెబ్బకొట్టాలని ప్రయత్నించింది. కానీ తన చిరకాల మిత్ర దేశం ఫిలిప్పీన్స్‌తో సహా ఆ ప్రాంత దేశాలు అమెరికా పథకంలో భాగం కావడానికి విముఖత చూపుతున్నాయి.
చైనా ఆ ప్రాంతంపై అమెరికా పట్టు బిగియకుండా సవాలు చేస్తున్నది. అక్కడితో ఆగకుండా, అమెరికా దష్టిని కొరియా ద్వీపకల్పం వైపు మళ్ళించింది. ఎన్ని దేశాలు దాడిచేసినా ఉత్తర కొరియాలోని పాలక వ్యవస్థను దింపడానికి చైనా అనుమతించదు. దక్షిణ చైనా సముద్రం, కొరియా ద్వీపకల్పం -రెండూ అమెరికా, చైనా ఘర్షణలకు కేంద్రాలు. ఈ రెండు దేశాలు చర్చల ద్వారా సదవగాహనకు వస్తే తప్ప శాంతి నెలకొనదు. నిరంతరం యుద్ధాలలో మునిగిపోవడం ఏ దేశానికీ క్షేమదాయకం కాదు.


