8 మంది పిల్లల్ని కనండి .. స్వామి ప్రబోధానందగిరి సలహా
- 19 Views
- admin
- May 2, 2017
- జాతీయం తాజా వార్తలు
”మేమిద్దరం…మాకు 8 మంది పిల్లలు”అనే విధానాన్ని ఆచరణలో పెట్టాలని సనాతన్ ధర్మ మహాసాంగ్ జాతీయ అధ్యక్షుడ్కెన స్వామి ప్రభోధనంద గిరి సలహా ఇచ్చారు. సంభాల్ లోని లఖీపూర్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వామి ప్రబోధానందగిరి మాట్లాడారు. ప్రస్తుతం హిందూత్వానికి ముప్పు ఏర్పడిందని, దీనికోసం ప్రతి హిందూ బాధ్యతగా భావించి హిందూత్వ సమాజాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. దీని కోసం ప్రతి హిందూ ఎనిమిది మంది పిల్లలను కనాలని సూచించారు. హిందువుల భద్రత కోసం ‘హిందూ రక్షా దళ్’ ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ దళం రాష్ట్రంలో వ్యాప్తి చెందుతుందని స్వామి ప్రబోధానందగిరి పవన వన ఆశ్రమంలో జరిగిన సభలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీఎం యోగి అదిత్యానంద గోవధను నిషేధించి మంచి ప్రారంభంతో చరిత్ర స ష్టించారని ఆయన ప్రశంసించారు. దేశానికి మొదటిసారి నరేంద్ర మోదీలాంటి మంచి ప్రధాని లభించాడని స్వామి ప్రబోధానందగిరి వివరించారు.


