ఉత్సవ పొస్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు
- 13 Views
- admin
- May 3, 2017
- తాజా వార్తలు స్థానికం
గోపాలపట్నం, ఫీచర్స్ ఇండియా : గోపాలపట్నం, ప్రశాంతినగర్ గ్రామ దేవత పైడితల్లి అమ్మవారి తీర్థ మహోత్సవముల ఈనెల 7వ తేదీ నుండి 9 వరకూ జరగనున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే ఐదు ఆదివారం అమ్మవారి గుడి ప్రాంగణం ముందు పుట్టబంగారం తీస్తారని, మరసటి రోజు సోమవారం నూకాలమ్మ గుడివద్ద తోలేళ్ల సంబరం ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. మంగళవారం సాయింత్రం ఆలయం ఎదుట డాన్స్బేబి డాన్స్, తప్పెటగుళ్ళు, పలు సాంస్క ృతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో గొర్లె కృష్ణ, మూర్తియాదవ్, పొట్టిమూర్తి, బుద్ధా శివాజీ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సారూ.. నన్ను పట్టించుకోరూ..?

గోపాలపట్నం, ఫీచర్స్ ఇండియా : స్థానిక గోపాలపట్నం, ఇందిరానగర్లో పారిశుధ్య పడకేసింది. శానిటరీ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లేక పోవడంతో గత నాలుగు రోజులగా డ్రైనేజ్ కాలువ లీకైయి రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుంది. తీవ్ర దుర్గంధం వెలువడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గోపాలపట్నం మెయిన్ రోడ్డుకు అనుసంధానం ఉండే రహదారి కావడంతో పాదచారులు, వాహనదారులు పలు ప్రమాదాలు గురౌయ్యారు. డ్రైనేజ్కాలువ నుండి వెదజల్లుతోన్న దుర్వాసనకు పలు అంటురోగాలు సోకే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు. లేకపోతే జనం రోగాల బారినపడే ప్రమాదం పొంచి ఉంది.


