గృహ సముదాయంలో సమస్యల తిష్ట.. అధికారులపై జీవీఎంసీ కమిషనర్ ఆగ్రహం
- 12 Views
- admin
- May 3, 2017
- తాజా వార్తలు స్థానికం
మధురవాడ, ఫీచర్స్ ఇండి యా: మధురవాడ కొమ్మాది విలేజ్లో జీవీఎంసీ కమిషనర్ సుడిగాలి పర్యటన చేశారు. జీవీఎంసీ 4వ వార్డు పరిధి జేఎన్ఎన్యుఆర్ఎం గృహ సముదాయాలను పరిశీలిం చారు. స్థానిక నివాసితులకు అందుతు న్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కే-2 కాలనీలోని 27బ్లాకుల్లో సుమారు 800 ఇల్లు నిర్మిం చారు. అధికారులు అవస రమైన సదు పాయాలు కల్పించక పోవటంతో అందులో కేవలం 2 బ్లాకుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తు న్నారు. ఉన్న కొద్దిమందికీ కనీస సదుపాయాలు కల్పించలేదని స్థానికులు కమిషనర్ ముందు వాపోయారు. ముఖ్యంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని, పారిశుధ్య నిర్వహణ అధ్వాన్నంగా తయారైందని చెప్పారు. దీనిపై స్పందించిన కమిషనర్, సంబంధిత అధికారు లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో ఇక్కడి నివా సితులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
Categories

Recent Posts

