త్వరలోనే తెలుగు తమ్ముళ్ల ఎన్నిక.. అర్బన్, జిల్లా అద్యక్షులుగా కొత్త ముఖాలకు అవకాశం
- 10 Views
- admin
- May 3, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖ: తెలుగు దేశం పార్టీ రాజకీయాలు ఇప్పుడు అమరావతితో పాటు విశాఖ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నెల ఆఖరివారంలో జరిగే మహానాడుకు ఏర్పాట్లు జరుగుతుండగా మరో వైపు సంస్థాగత ఎన్నికలు ముందుగానే పూర్తి చేయాలని అధినేత భావిస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లల్లో కొంత చలనం, చర్చ మొదలైంది.
విశాఖ అర్బన్, జిల్లాకు సంబంధించి నాయకత్వానికి రెండేళ్ల కాలపరిమితి వచ్చే నెలతో ముగుస్తోంది. దీనికి సంబంధించి వార్డుల వారీగా ఎన్నికలు మొదలు పెట్టారు. కొన్ని వార్డులకు అద్యక్ష, కార్యదర్శలు ఎన్నికలు కూడా పూర్యయ్యాయి. ఈ దశలో 72 వార్డులకు కలిసి అర్బన్ జిల్లా అద్యక్షుని ఎన్నిక జరగనుంది. ఈ దశలో మహానాడు తరువాత ఈ ప్రక్రియ చేపట్టాలని పార్టీ భావించింది. కానీ అధినేత మాత్రం మహానాడుకు ముందుగానే నిర్వహించాలని ఆదేశించారు. దీంతో ఇప్పటి వరకు అర్బన్ అద్యక్షునిగా ఎమ్మెల్యే వాసుపల్లి కొనసాగుతున్నారు. ఈ దశలో వాసుపల్లిని తిరిగి కొనసాగించాలన్న అంశంచర్చ కొనసాగుతోంది. అదే సమయంలో మరొకరికి కేటాయించడం ద్వారా అదనంగా మరొకరకిరి అవకాశం కల్పించినట్టవుతుందన్న అంశం కూడా పరిశీలనలో ఉంది. కాగా అర్బన్ అద్యక్ష పదవికి గతంలో మాజీ కార్పొరేటర్ పట్టాభి, నల్లూరి భాస్కర్రావులు పోటీ పడ్డారు. ఈ సారి కూడా ఆ ఇద్దరు ఆశించే అవకాశాలున్నాయి. అదే సమయంలో టీడీపీ నాయకులు పీలా శ్రీను కూడా అద్యక్ష పదవి రేసులో ఉండే అవకాశాలున్నాయి. వీటన్నింటిని మహానాడు నాటికి పూర్తి చేయాలని అధినేత మంగళవారం సూచించారు.
జిల్లా రేసులో సుందర విజయకుమార్
జిల్లాకు సంబంధించి పార్టీ పగ్గాలను సామాజిక సమీకరణల్లో నేపథ్యంలోసీనియర్ నాయకులు పప్పల చలపతిరావుకు కేటాయించారు. వ్యక్తిత్వం పరంగా మంచితనం ఉన్నా
పార్టీని బలంగా తీసుకు వెళ్లలేక పోయారన్న విమర్శ ఆయన పై ఉంది. ఈ దశలో కొత్త నాయకులకు అవకాశం తప్పనిసరి.
దీంతో జిల్లా పరిషత్ చైర్మెన్ భర్త లాలం భాస్కర్రావు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే కీలక పదవులు ఒకే కుటుంబానికి అన్న కోణంలో యలమంచలి ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ సుందర విజయకుమార్ కు జిల్లా పార్టీ పగ్గాలు అందించాలన్న ఆలోచన పార్టీలో ఉంది. ఆ క్రమంలో ఆయనకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. యువ నాయకుడికి కేటాయిస్తే పార్టీలో చురుకుదనం ఉంటుందన్న భావం కూడా సీనియర్లలో ఉంది. కాగా జిల్లాలో భవిష్యత్తు ఎన్నికల దృష్ట్యా ఎమ్మెల్యేలకు అద్యక్ష పదవి కేటాయిస్తే మంచిందన్న వాదన కూడా వినిపిస్తోంది.ఆ క్రమంలో సీనియర్ నాయకులు బండారు, యలమంచలి ఎమ్మెల్యే పంచకర్ల పేర్లు వినిపిస్తున్నాయి.


