61వ వార్డులో టిడిపి విస్తత స్థాయి సమావేశం
- 16 Views
- admin
- May 3, 2017
- తాజా వార్తలు స్థానికం
గాజువాక, ఫీచర్స్ ఇండియా : సంస్థాగతంగా టిడిపిని మ రింత బలోపేతం చేసేందుకు విస్తత స్థాయి సమావేశాలను వార్డుల వారిగా నిర్వహి స్తుంది. దీనిలో భాగంగా జీవీఎంసీ 61వ వార్డు శ్రీరాంనగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో వార్డు అధ్యక్షులు పప్పుశంకరరావు అధ్యక్షతన సమవేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పరిశీ లకులు కాశీ నవీన్ కుమార్ హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లా ల్సిన భాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. ప్రతి ఒక్క టిడిపి అభిమాని, కార్యకర్త కూడా టిడిపి బలోపేతానికి కషిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ సైనికుడిలాగా పనిచేయాలని కోరారు. ఈ సమవేశంలో వార్డు పరిశీలకులు ప్రసాదుల శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు పప్పు రాజారావు, జిల్లా కార్యదర్శి కరణం కనకారావు, బి.రంగయ్య దొర, కె.పోతురాజు, కృష్ణారావు, వియ్యపు లక్ష్మి, కరణం రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.