సినిమా బాగా రాకపోతే విడుదల చెయ్యనంటూ ఈమధ్యే స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున ‘రారండోయ్ వేడుక చూద్దాం’ విషయంలో అసలు కాంప్రమైజ్ అవుతున్నట్టు లేడు. మే 19 రిలీజ్‌కి సర్వం సిద్ధమైందని అనుకుంటోన్న టైమ్‌లో దీనిని జూన్ 8కి వాయిదా వేసినట్టు వార్తలు వస్తున్నాయి.
సమ్మర్ సీజన్లో రిలీజ్ చేస్తే ఈ కుటుంబ కథా చిత్రానికి అడ్వాంటేజ్ వుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని పుల్ చేసే చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడం వల్ల లాభాలేంటనేది చాలా చిత్రాలు నిరూపించాయి. అయితే ప్రోడక్ట్ పరంగా క్వాలిటీ మిస్ కాకూడదని, ఎట్టి పరిస్థితుల్లోను ఈ చిత్రం మిస్‌ఫైర్ అవకూడదని, సీజన్‌ని కూడా నాగార్జున మిస్ చేసుకుంటున్నాడు.
జూన్ 12 నుంచి స్కూల్స్ రీఓపెన్ అయిపోయి మళ్లీ అంతా రొటీన్ లైఫ్‌తో బిజీ అయిపోతారు. జూన్ 8న విడుదల చేయడం వల్ల ‘రారండోయ్’ సీజన్ అడ్వాంటేజ్ కోల్పోవడమే కాకుండా, మరో బిగ్ రిలీజ్ ‘దువ్వాడ జగన్నాథమ్’కి దగ్గరగా వెళుతుంది.
అది వచ్చేలోగా రెండు వారాల సమయమే వుంటుంది కనుక ఈ చిత్రానికి ఎక్కువ టైమ్ దొరకదు. ఈ డిజట్వాంటేజ్ని అధిగమించే సత్తా సినిమాలో వుంటే సరే. లేదంటే మాత్రం వేడుక చేసుకునే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నట్టే.
సీజన్ మిస్ చేస్తోన్న నాగార్జున
- 12 Views
- admin
- May 4, 2017
- తాజా వార్తలు సినిమా

Categories

Recent Posts

