భువనేశ్వర్: ఒడిషా అసెంబ్లీ స్పీకర్ నిరంజన్ పూజారి శుక్రవారం రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు రావడంతో ఆయన రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఏడాది ఒడిషా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికారంలో ఉన్న బిజూ జనతా దళ్ (బీజేడీ) దానికి సన్నద్ధమవుతోంది.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో బీజేడీపై ప్రజల్లో పట్టు కోల్పోకుండా ఉండేందుకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం నవీన్ పట్నాయక్ దృష్టిపెట్టారు. దీంతో కొందరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి నియోజకవర్గాలపై పట్టు సాధించే యోచనలో ఉన్నారు. ఈనేపథ్యంలో స్పీకర్ నిరంజన్ పూజారి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.