విశాఖను సందర్శించిన డీజీపీ.. పోలీసు ఉన్నతాధికారులతో అత్యావసర సమావేశం
- 24 Views
- admin
- May 6, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం క్రైం, ఫీచర్స్ ఇండియా: విశాఖ ఏజన్సీ చింతపల్లి మండలం వి.అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం మావోలు మందుపాతర పేల్చిన సంఘటన విషయమై జిల్లా, నగర పోలీసు ఉన్నతాధికారులు చర్చించేం దుకు డిజిపి ఎన్ సాంబశివరావు, శనివారం విశాఖకు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ యోగానంద్, డిజిపిని కలిసి శాంతిభద్రతల విషయమై చర్చిం చారు. అనంతరం మావోల మందుపాతరకు అశువులుభాసిన హోంగార్డు కుటుంబాన్ని ఓదార్చేందుకు పీఎం పాలెంలోని మృతుని ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. అంతే కాక చింతపల్లి మండలం అన్నవ రం పోలీస్ స్టేషన్ పరిధిలో మందు పాతర పేల్చిన సంఘటన స్థలాన్ని డిజిపి పరిశీలించినట్లు సమాచారం. అలాగే ఈనెల 27, 28, 29 తేదీల్లో విశాఖ ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో జరనున్న మహానాడు వేదిక స్థలాన్ని కూడా పరిశీలించి భద్రతపై అధికారులతో సమాలోచనలు జరిపారు.
వైభవంగా వైభవ్ వెంకటేశ్వర స్వామి 15వ వార్షికోత్సవం
మాధవధార, ఫీచర్స్ ఇండియా : స్థానిక 38వ వార్డులో గల ఎన్జీజీవోఎస్ఎస్ కాలని(కప్పరాడ) నందు వెలసిన శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి 15వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమ య్యాయి. మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శేషు స్వామి తెలిపారు. ఈ వార్షకోత్సవం సందర్భంగా అతి విశాలమైన ఈ దివ్యక్షేత్రం నందు కలియుగ ప్రత్యక్షదైవం, కరుణారస సముద్రుడు శ్రీనివాసుడికి శనివారం ఉదయం 5గం||ల నుండి సుప్రభాత సేవతో పాటు ప్రాత:కాల అర్చన, బాలభోగం, మం గళ శాసనం, పతాక ప్రతిష్ట, విశేష హోమములు వంటి పూజలతో పాటు సా||గంట లకు స్వామి వారికి ఎదురు సన్నాహ ఉత్సవము, అలాగే 6గం||లకు శ్రీవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటి నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల పాటు జరుగు ఈ ఉత్సవం సందర్భంగా శ్రీవారికి లక్ష మల్లె పూలతో అర్చన, శ్రీవారి చక్రస్నాన వసంతోత్సవం, ఉంజల్ సేవ, దర్శనం, హారతి, ఈనెల 21న మధ్యాహ్నం నారాయణ సేవ(అన్నసమారాధన), 22న సాయంత్రం ఆరుగంటలకు శ్రీవారి తిరువీధి మహోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా శనివారం ఉదయంనుండి వందలాది మంది భక్తులు స్వామి వారి విశేష పూజల్లో పాల్గొన్నారు.
‘గంట’కు పారిశుధ్య కార్మికుల మద్దతు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: జీవీఎంసీ గుర్తింపు యూనియన్‌కు మంగళవారం జరగనున్న ఎన్నికల్లో తాము ‘గంట’ గుర్తుకు సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నట్లు భీమిలి, తగరపువలస ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ప్రకటించారు. శనివారం ఉదయం భీమిలిలో నిర్వహించిన ప్రచార సమవేశంలో బీజేఎంఎం అనుబంధ యూనియన్ అధ్యక్షుడు బుగత వెంకటనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయం మరికొన్ని గంటలు మాత్రమే ఉందని, ఓటు హక్కు కలిగిన ప్రతీ జీవీఎంసీ ఉద్యోగి వామనరావు యూనియన్(గంట గుర్తు)కు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రతీ ఒక్క కార్మికుని సమస్య తాము గుర్తించామని, గెలుపొందిన వెంటనే మొదటిగా వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇప్పటికే 72 వార్డుల్లో గంట గుర్తుకు సంపూర్ణ మద్ధతు లభించిందని,మంగళవారం సాయంత్రానికి విజయ బావుటా ఎగురవేయనున్నట్లు ధీమాను వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులతో పాటు యూనియన్ నాయకులు బీ లక్ష్మణరావు, కోరాడ రామారావు, భైరవ రాజు, పారిశుధ్య మేస్త్రీలు పరదేశి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
గాజువాక కోర్టులో వెయిటింగ్ హాలు.. భూమిపూజ చేసిన ప్రిన్సిపల్ జిల్లా జడ్జి
గాజువాక ఫీచర్స్ ఇండియా : గాజువాక కోర్ట్ ప్రాంగణంలో కక్షిదారులు వేచివుండేందుకు అదనపు భవన నిర్మాణానికి శనివారం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి పీవీ జ్యోతిర్మయి భూమిపూజ చేశారు. అనంతరం కొర్టు ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అక్కడనుండి కొర్టు హాళ్లను, న్యాయమూర్తి భవనాలను సందర్శించారు. ఆమెవెంట సెకండ్ ఎడిజె యు సత్యారావు, పదమూడవ ఎడీజే వై గణపతిరావు, థర్డ్ ఏసీఎంఎం బి సత్యనారాయణ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పీ సత్యదేవి, జిల్లా కోర్టు పరిపాలన అధికారి నాగేశ్వరరావు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు వెన్నల ఈశ్వరరావు, మంత్రి నగేష్ , విజయకుమార్, ప్రసన్న, చిరంజీవి, యల్.కె.వి.రామ్‌నద్, వి.శ్రీనివాసరరావు, రామకృష్ణ, శ్రీనివసరావు తదితరులు పాల్గున్నారు.
24/7 వెలుగులు.. పట్టించుకోని జీవీఎంసీ సిబ్బంది
కంచరపాలెం, ఫీచర్స్ ఇండియా : జీవీఎంసీ 37వ వార్డు పరిధి ఇందిరానగర్-4లో కొండపై ఉన్న విద్యుత్ లైట్లు రాత్రి పగలు వెలుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం విద్యుత్ ఆదా కోసం అనేక చర్యలు తీసుకుంటుంటే, సంబంధిత సిబ్బందికి ఇది ఏమాత్రం పట్టడం లేదు. ఈ ప్రాంతంలో కొంత కాలం క్రితం విద్యుత్ దీపాల మరమ్మత్తులు నిర్వహించారు. ఆ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలకు నేరుగా కనెక్షన్లు ఇవ్వడంతో అప్పటి నుంచి వీధి లైట్లు రాత్రి, పగలు అని తేడా లేకుండా నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. మరోవైపు వార్డుఉలో విద్యుత్ దీపాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కొన్ని చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. తక్షణం జీవీఎంసీ, విద్యుత్ విభాగం అధికారులు స్పందించి విద్యుత్ వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
భారీగా అప్పన్న హుండీ ఆదాయం
సింహాచలం, ఫీచర్స్ ఇండియా : సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి రికార్డు స్థాయిలో ఆదాయం తెచ్చిపెట్టింది. హుండీలద్వారా కోటీ ఒకలక్ష యాభైవేల రూపాయలు, టిక్కెట్ల ద్వారా కోటీ 55 లక్షల రూపాయలు ఆదాయం సమకూరిందని ఈఓ కే రామచంద్రమోహన్తెలిపారు. ఈ నెలలో కప్పస్థంభం ఆలింగనం ద్వారా ఎనిమిది లక్షల రూపా యలు దేవస్థానానికి ఆదాయం సమకూరిందన్నారు. మే, జూన్ నెలలో స్వామి భక్తుల రాక పెరగనుంది. రానున్న వైశాకపౌర్ణమికి భక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. వైశాఖపౌర్ణమి నాడు స్వామివారికి రెండవ విడత చందనమును సమర్పించనున్నారు. ఈ రెండు నెలలపాటు ఉత్తరాంధ్ర జిల్లాల రైతులు స్వామి వారికి కోడెదూడలను భారీ స్థాయిలో సమర్పిస్తుం టారు. శనివారం కావడంతో భక్తజనసంద్రమైంది. క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎండవేడిమిని తట్టుకోవడానికి మంచినీళ్లను, మజ్జిగను పంపిణీచేస్తున్నారు.
ఘనంగా కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి
కంచరపాలెం, ఫీచర్స్ ఇండియా: కార్ల్ మార్క్స్ ద్విశత జయంతిని కంచరపాలెం బొట్టానర్సింగ భవనంలో నిర్వహించారు. 36వ వార్డు మాజీ కార్పోరేటర్ బొట్టా ఈశ్వరమ్మ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవాళి ఉన్నంత వరకూ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు దోహదపడతాయన్నారు. సోషలిస్టు వ్యవస్థలో సృజనాత్మకత కేవలం మార్క్సిస్టు వల్లే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గౌవర అధ్యక్షులు వీవీసీ నర్సింహులు, డివైఎఫ్ఐ నగర నాయకులు వీఎస్ఎన్ రాజు, సీఐటీయూ ఉప కార్యదర్శి ఓ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


