ఇక పాక్‌లోకి వెళ్లి దాడులు చేస్తాం..
- 11 Views
- admin
- May 8, 2017
- అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు

ఇరాన్-పాక్ సరిహద్దుల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతోపాటు ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. పాక్ ప్రభుత్వం వెంటనే ఉగ్రవాదుల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇరాన్‌పై ఇలాగే దాడులు కొనసాగితే పాక్లోపలికి వెళ్లి వాళ్లు ఎక్కడున్నా దాడులు చేస్తామన్నారు. 2014లోనే పాక్‌కు చెందిన జైష్ అల్ అదల్ ఉగ్రవాదసంస్థ ఐదుగురు ఇరాన్ సైనికులను కిడ్నాప్ చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన ఇరాన్ సైనికచర్యకు సిద్ధమని ప్రకటించింది. అయితే కొందరు మధ్యవర్తుల జోక్యంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు కుదుటపడ్డాయి. ఇరాన్లో మెజార్టీ వర్గీయులు షియాలు. వారి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా జైష్ పోరాడుతోంది. 2014లో ఐదుగురు ఇరాన్ సైనికుల్లో నలుగురిని మాత్రమే విడుదల చేసింది ఒక సైనికుడిని చంపివేయడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి.


