జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా పరిగణిస్తాం
- 15 Views
- admin
- May 8, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
శ్రీనిందితుల మూలాలపై చర్యలకు సిఫారసు
శ్రీప్రెస్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా సభ్యులు ప్రభాత్ దాస్, అమర్నాథ్
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తామని ప్రెస్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా సభ్యులు ప్రభాత్ దాస్, అమర్నాథ్ లు పేర్కొన్నా రు. విశాఖ జిల్లా నాతావరం లో జర్నలిస్టు బాబుపై జరిగిన హత్యాయ్నంలో నిజ నిర్థారణ కోసం వచ్చిన ప్రెస్ కౌన్సెల్ సభ్యులు సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల సంఖ్య పెరిగిందన్నారు. దీనిపై మూలాలను గుర్తించే క్రమంలో ప్రెస్ కౌన్సెల్ ఉందని పేర్కొన్నారు. అసలు సూత్రధారులపై చర్యలు తీసుకున్నప్పుడే దాడులకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. ఈ దశలోనే నాతావరంలో రిపోర్టర్ పై జరిగిన దాడిని సుమోటోగా స్వీకరించినట్టు వివరించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి వివరాలను కోరుతున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనల నిరోధానికి జర్నలిస్టులు సంఘటితంగా ఉండాలని సూచించారు. ఆంద్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ ఎపీ లో జరిగే దాడులపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన కనిపించనట్లయితే ఈ నెల 15 వ తేదీన ఎపీలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎపీయూడబ్ల్యూజె నగర అధ్యక్షులు రావులవలస రామచంద్రరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై యూనియన్లకు అతీతంగాపోరాటం చేస్తామని చెప్పారు. విజెపీఎఫ్ అద్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ప్రెస్ కౌన్సెల్ సభ్యులను అభినందించారు. జర్నలిస్టుల హక్కుల సాధనకుచేస్తున్న ప్రయత్నాన్ని కొనియాడారు. తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం ప్రెస్ కౌన్సెల్ సభ్యులు ప్రభాత్ దాస్ అమర్ నాథ్ లను సన్మానించారు. ఈ మీడియా సమావేశంలో ఎఫీయూడబ్ల్యూజె రాష్ట్ర అద్యక్షులు నల్లి ధర్మారావు, ఐజెయూ ఉపాద్యక్షులు అంబటి ఆంజనేయులు, విశాఖ నగర కార్యదర్శి కె. చంద్రమోహన్, కోశాధికారి కిల్లి ప్రకాశరావు, దాడి వెంకట్రావు, వీరేంద్ర యాదవ్, కలంపోరాటం ప్రసాద్ తదితరులు పాల్లొన్నారు.


