సింగర్ సునీత కూతురి గురించి నీచమైన పోస్ట్… సునీత ఆగ్రహం!
- 26 Views
- admin
- May 8, 2017
- తాజా వార్తలు సినిమా

కొన్ని యూట్యూబ్ చానళ్ల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. ఏదో ఉన్నట్లు హెడ్డింగ్ పెట్టి వీడియో క్లిక్ చేయగానే ఇంకేదో చూపించి జనాలను మోసం చేసి సొమ్ము చేసుకునే ధోరణి వెర్రితలలు వేస్తున్న రోజులివి. ఇదిలా ఉంటే, సెలబ్రెటీలను కొన్ని యూట్యూబ్ చానళ్లు పనిగట్టుకుని మరీ దిగజారుస్తున్నాయి. వ్యూస్ యావలో హెడ్డింగ్స్ మరింత నీచంగా పెడుతున్నారు. తాజాగా సింగర్ సునీత, ఆమె కూతురికి సంబంధించి ఓ యూట్యూబ్ చానల్ చూపించిన అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘సింగర్ సునీత కూతురుని చూశారా… కత్తి లాగా ఉంది’ అంటూ టీనేజ్ వయసులో ఉన్న సునీత కూతురి గురించి నీచమైన హెడ్డింగ్ పెట్టి, సునీత అప్పుడప్పుడూ కూతురితో కలిసి దిగిన ఫోటోలను కలిపి ఓ వీడియో సృష్టించారు. ఈ వీడియో యూట్యూబ్‌లో పెను దుమారమే రేపింది. సింగర్ సునీతకు ఈ విషయం తెలిసి అగ్గి మీద గుగ్గిలమైందట. ఒక టీనేజ్ వయసున్న అమ్మాయి గురించి మరీ ఇంత నీచంగా హెడ్డింగ్స్ పెడతారా అంటూ మండిపడిందట. తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా భావించిందట. అయితే ఇలాంటి యూట్యూబ్ చానళ్లు ఎన్నో ఉన్నాయని, ఎన్నింటి మీద ఫిర్యాదు చేయగలమని ఊరుకుందట. కానీ ఇంత నీచంగా ఓ అమ్మాయి గురించి పోస్ట్ పెట్టడానికి ఆ అడ్మిన్‌కు మనసెలా వచ్చిందోనని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. యూట్యూబ్ చానళ్లు ఇకనైనా పైత్యాన్ని తగ్గించుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
Categories

Recent Posts

