టోక్యో: జపాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. మయాకో ద్వీపం సమీపంలోని జలాల్లో భూమికి 10 కిలోమీటర్ల లోతులు ఈ ప్రకంపనల కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అమెరికా భూభౌతిక పరిశోధనా కేంద్రం కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ భూకంపంతో సముద్రమట్టాల్లో స్వల్ప తేడాలు వస్తాయి కానీ సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో నాలుగు టెక్టానిక్ ప్లేట్లలో వచ్చే కదిలికల వల్ల ఏటా ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయని అధికారులు తెలిపారు. 2011లో సముద్ర గర్భంలో ఏర్పడిన భారీ ప్రకంపనల కారణంగా ఇక్కడ సునామీ ఏర్పడింది. ఈ విపత్తులో దాదాపు 18,500 మంది ప్రాణాలు కోల్పోయారు.