.రంగంలోకి కోబ్రాలు..!
- 21 Views
- admin
- May 9, 2017
- జాతీయం తాజా వార్తలు
న్యూదిల్లీ: మావోలపై పోరులో వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న భద్రతా దళాలకు దన్నుగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సీఆర్పీఎఫ్లోని అత్యంత కీలకమైన కోబ్రా దళాలను మావోయిస్టుల ఏరివేతకు పంపించింది. దాదాపు 2,000 కోబ్రా కమాండోలను ఛత్తీస్గడ్కు తరలించనున్నారు. ముఖ్యంగా సుకుమా వంటి ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధతంత్రలో ఆరితేరిన బలగాల అవసరం చాలా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తిచండంతో ఈ చర్యలను చేపట్టింది. తరచూ ఈ రాష్ట్రంలో మావోయిస్టులు భద్రతా దళాలపై విరుచుకు పడటంతో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. ఇప్పటికే పారామిలటరీ అధికారులు దాదాపు 20 నుంచి 25 కంపెనీల బలగాలను సమీకరించేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేశారు. ప్రతి కంపెనీలో 100 మంది కమాండోలు ఉంటారు. ప్రస్తుతం ఈ దళాలు పశ్చిమ బంగా, బీహార్, తెలంగాణ, మధ్యప్రదేశ్లోని బస్తర్ రీజియన్లో ఉన్నాయి. ఈ కమాండోల కదలికలు మొత్తం ఇంటిలిజెన్స్ నివేదికల ఆధారంగానే ఉంటాయి. వీరు శత్రువులను అచేతనలను చేసి దాడులు చేయడటంతో శిక్షణ పొందారు. మొత్తం 154 కోబ్రా బ ందాల్లో 44 చత్తీస్గడ్లో వినియోగించనున్నారు. నిన్న 10రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో జరిగిన భేటీలో ఈ విషయాన్ని చర్చించారు. కోబ్రా బలగాలను 2009లో సీఆర్పీఎఫ్ చట్టం కింద ఏర్పాటు చేశారు. కేవలం గెరిల్లా పోరాటానికి మాత్రమే వినియోగించేట్లు వీటిని సిద్ధం చేశారు.


