రిజర్వ్‌బ్యాంక్‌లో 161 ఉద్యోగాలు
- 20 Views
- admin
- May 9, 2017
- తాజా వార్తలు యువత
-దేశ అపెక్స్ బ్యాంక్‌లో ఉద్యోగం -డిగ్రీ / పీజీ అభ్యర్థులకు అవకాశం
-ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
ముంబైలోని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారత దేశపు అపెక్స్ బ్యాంక్/ కేంద్ర బ్యాంక్. ఈ బ్యాంక్‌ను 1935, ఏప్రిల్ 1న స్థాపించారు.
మొత్తం పోస్టుల సంఖ్య – 161
గ్రేడ్ బీ ఆఫీసర్ (డీఆర్ జనరల్ )-145 పోస్టులు (జనరల్-73, ఓబీసీ-39, ఎస్సీ-22, ఎస్టీ-11)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. పదోతరగతి, ఇంటర్ స్థాయిలో కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.
గ్రేడ్ బీ ఆఫీసర్ (డీఆర్బ డీఈపీఆర్) -12 పోస్టులు (జనరల్-9, ఓబీసీ-3)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎకానిమిక్స్, ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్. ఫైనాన్స్‌లో మాస్టర్ డిగ్రీలో 55 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత.
గ్రేడ్ బీ ఆపీసర్ (డీఆర్,డీఎస్ఐఎం) -4 పోస్టులు (జనరల్-1, ఎస్సీ-1, ఎస్టీ-2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ (ఐఐటీ ఖరగ్‌పూర్)/ఐప్లెడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ (ఐఐటీ బాంబే) వీటిలో ఏదైనా కోర్సులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత లేదా 55 శాతం మార్కులతో మ్యాథ్స్‌లో పీజీతోపాటు కనీసం ఏడాది వ్యవధి ఉండే పీజీ డిప్లొమా ఇన్ స్టాటిస్టిక్స్ కోర్సు పూర్తి చేయాలి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎంస్టాట్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. లేదా ఐఎస్ఐ కోల్‌కతా, ఐఐటీ ఖరగ్‌పూర్. ఐఐఎం కోల్‌కతా మూడు సంస్థలు కలిసి అందిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సును 55 శాతం మార్కులతో పూర్తిచేయాలి.
వయస్సు: 2017, మే 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1987, మే 2 నుంచి 1996, మే 1 మధ్య జన్మించి ఉండాలి. ఎంఫిల్ పూర్తిచేసినవారికి 32 ఏండ్లు, పీహెచ్డీ అభ్యర్థులకు 34 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. బోధనలో అనుభవం ఉన్నవారికి మూడేండ్ల సడలింపు ఇస్తారు.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ. 35,150-62400/-. ఎంపికైన అభ్యర్థులు వేతన రూపంలో ఆరంభంలోనే నెలకు రూ. 68,000 వరకు పొందవచ్చు.
అప్లికేషన్ ఫీజు: రూ. 850/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు రూ.100/-)
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, కోదాడ, కరీంనగర్, వరంగల్
ఎంపిక విధానం: మూడుదశల్లో జరుగుతుంది. రాతపరీక్ష (ఫేజ్- 1, ఫేజ్ -2) ఇంటర్వ్యూ ద్వారా
ప్రిలిమినరీ ఎగ్జామ్: ఫేజ్1 పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీన్ని ఆన్లైన్లోనే నిర్వహిస్తారు.
జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
పరీక్ష సమయం 120 నిమిషాలు
ఫేజ్ -2 పరీక్షకు ఎంపిక కావాలంటే ఫేజ్ -1 పరీక్షలో ప్రతి సెక్షన్ నుంచి కనీస కటాఫ్ మార్కులను సాధించాల్సి ఉంటుంది.
ఆయా విభాగాల్లో ఖాళీలకు అనుగుణంగా మెరిట్ ప్రాతిపదికన తర్వాత దశకు ఎంపిక చేస్తారు.
మెయిన్ ఎగ్జామ్ : ఈ పరీక్ష కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. మొత్తం మూడు పేపర్లు ఉంటాయి.
పేపర్-1 ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అంశంపై 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే వస్తాయి.
పేపర్-2 ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్‌పై 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష (పేపర్) డిస్క్రిప్టివ్ తరహాలోనే ఉంటుంది.
పేపర్-3 ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ అంశంపై 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష (పేపర్) ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది.
ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయం 90 నిమిషాలు.
ఇంగ్లిష్ పేపర్ మినహా మిగిలిన ప్రశ్నలన్ని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.
ఇంటర్వ్యూ – 50 మార్కులు.
ఫేజ్ 2 (పేపర్ 1+ పేపర్ 2+ పేపర్ 3)లో చూపిన ప్రతిభ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఫేజ్2, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 23
ఫేజ్1 పరీక్ష తేదీ: జూన్ 17
ఫేజ్2 పరీక్ష తేదీ: జనరల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి జులై 7న ఫేజ్ పరీక్ష నిర్వహిస్తారు. డీపీఆర్ డీఎస్ఐఎం పోస్టులకు పేపర్ 2,3 పరీక్షలు జులై 6 లేదా 7 తేదీల్లో నిర్వహిస్తారు.
వెబ్సైట్: www.rbi.org.in


