ఓ సీక్రెట్ కోడ్.. ఈవీఎం ఖేల్‌ఖతం!
- 15 Views
- admin
- May 9, 2017
- జాతీయం తాజా వార్తలు

ఎన్నికల ముందు ఈవీఎంలను ఎలా పరిశీలిస్తారు. ఓటు వేస్తే ఎలా రికార్డ్ అవుతుంది.. లాంటివన్నీ ఈ డెమోలో చెప్పారు సౌరభ్ భరద్వాజ్. దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పాతతరం ఈవీఎంలను వాడారని, వాటిని సులువుగా ట్యాంపర్ చేయొచ్చని చెప్పారు. అందుకే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భిన్నంగా వచ్చాయన్నారు. తొలుత ఈవీఎంల అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే అల్కా లంబా లేవనెత్తారు. ఆ తర్వాత సౌరభ్ సభ నుంచి బయటకు వెళ్లి.. ఈవీఎంను తీసుకొచ్చి వివరణ ఇచ్చారు.
ఓ వైపు ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్యుద్ధం జరుగుతుండగా.. అసెంబ్లీ సమావేశాల్లో ఆప్ ఈవీఎంల అంశాన్ని తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఆప్ నుంచి సస్పెండ్‌కు గురైన కపిల్ మిశ్రా.. కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మిశ్రా ఈ ఉదయం సీబీఐకి ఫిర్యాదు చేశారు. అయితే మిశ్రా ఆరోపణలను కొట్టిపారేసిన ఆప్.. ఈ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో సంచలన ప్రకటన చేస్తామని వెల్లడించింది. అయితే అది కేజ్రీవాల్ రాజీనామా కాదని, అంతకంటే పెద్ద విషయమని చెప్పింది. దీంతో ఆ సంచలన విషయం ఈవీఎంల గురించేనని పేర్కొనడం గమనార్హం.


