ఇంటికే రైలు టికెట్.. అందుకున్నాకే చెల్లింపు!
- 23 Views
- admin
- May 10, 2017
- జాతీయం తాజా వార్తలు
ఢిల్లీ: ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వటం. ఇంటికే సరకులు తెప్పించుకోవటం. ఆ తర్వాత డబ్బులు ఇవ్వటం మనందరికీ తెలిసిందే. అలాగే రైలు టికెట్‌నూ ఇంటికే తెప్పించుకుంటే? అప్పుడు టికెట్ డబ్బులు చెల్లిస్తే? ఆశ్చర్యపోతున్నారు కదూ. దీన్ని నిజం చేస్తోంది ఐఆర్సిటిసి. అందుకేనేమో ఐఆర్సీటీసీ తన వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఇప్పుడు టికెట్ అందుకున్నాక డబ్బులు చెల్లించే పద్ధతినీ ప్రవేశపెట్టింది. ఇది ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ఆన్‌లైన్‌కు మారటానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఈ సదుపాయాన్ని పొందటానికి ప్రయాణికులు తమ పేరును ఒకసారి నమోదు చేసుకుంటే చాలు. నగదు చెల్లింపు కోసం ఆధార్ లేదా పాన్ కార్డు వివరాలను అందించాల్సి ఉంటుంది. టికెట్ మొత్తం రూ.5వేల వరకూ ఉంటే రూ.90, రూ.5వేలు దాటితే రూ.120 రుసుము వేస్తారు. అమ్మకం పన్ను అదనం. రైల్వే ప్రయాణీకులకు ఇది నిజంగా వరమే.


