ఈయూకే ఫ్రాన్స్ ఓటు
దేశాధ్యక్షుడిగా విజయం సాధించి,అదే ఊపులో చట్టసభ ఎన్నికలలోనూ తమ పార్టీని గెలిపించుకున్నా ఫ్రాన్స్‌ను ముందుకు నడుపడం మాక్రాన్‌కు అంత సులువేమీ కాదు. ఫ్రాన్స్‌లో తీవ్రమైన నిరుద్యోగం ఉన్నది. గత కొన్నేళ్లుగా అభివ ద్ధి స్తంభించిపోయింది. డోనాల్డ్ ట్రంప్ జాతీయ విధానంతో అధికారం హస్తగతం చేసుకున్నారు. స్థానికులకే ఉద్యోగాలు అంటూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో థెరీసా మే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేయటానికి ప్రయత్నిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మధ్యేవాద అభ్యర్థి మాక్రాన్ ఎన్నికయ్యారు. యూరోపియన్ యూనియన్‌కు అనుకూలుడైన మాక్రాన్ విజ యం సాధించటంతో యూరప్‌తో పాటు అన్ని ఖండాలలోనూ ప్రపంచీకరణను కోరుతున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. జపాన్, ఈయూ దేశాలతో సహా, అమెరికాలో స్టాక్ మార్కెట్లు ఉత్సాహంతో ఉరకలు వేశాయంటే ఎన్నికల ఫలితాల ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. అమెరికాలో ట్రంప్ ఎన్నిక కావడం, బ్రిటన్ ప్రజలు ఈయూ నుంచి వైదొలగాలని(బ్రెగ్జిట్) నిర?యించుకోవడంతో యూరప్ అంతటా అతివాద జాతీయవాద పార్టీలు విజయం సాధిస్తాయనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడ్డది. కానీ మొదట ఆస్ట్రియాలో, ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో, ఇప్పుడు ఫ్రాన్స్‌లో అంచనాలు తలకిందులయ్యాయి. నేను రైటూ కాదు, లెఫ్టూ కాదని ప్రకటించుకున్న మాక్రాన్ సామాజిక సమస్యల విషయంలో మాత్రం వామపక్షవాదిగా ఆలోచిస్తానని చెప్పుకుని ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నేషనల్ ఫ్రంట్ నేత లీ పెన్ తీవ్ర జాతీయవాద ద క్పథంతో ప్రజలను తనవైపు తిప్పుకోజూశారు. ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కాలని, ఆ తర్వాతే వలస వచ్చిన వారికి దక్కాలని ట్రంప్ తరహా ప్రచారాన్ని లీ పెన్ దూకుడుగా చేశారు. జాతీయవాద విధానాలతో నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని, అభివ ద్ధికి అడ్డంకిగా మారిన అన్నింటినీ బుట్టదాఖలు చేస్తానని పరోక్షంగా ఈయూ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. కానీ జాతీయోత్పత్తిలో ప్రజా సంక్షేమానికి కేటాయిస్తున్న దాన్ని 56 శాతం నుంచి 52 శాతానికి కుదిస్తానని చెప్పిన మాక్రాన్‌కే ఫ్రాన్స్ ప్రజలు పట్టం గట్టారు.
జాతీయవాద పార్టీ నేషనల్ ఫ్రంట్ నేత లీ పెన్కు తాత్కాలికంగా అడ్డుకట్ట పడినా, రానున్న కాలంలో బలపడే అవకాశాలూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మాక్రాన్ 66.06 శాతం ఓట్లతో విజయం సాధించారు. కానీ లీ పెన్కు కూడా 33.94శాతం ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు కోటికి పైగా ఓట్లు సాధించారు. అదే గత ఎన్నికల్లో లీ పెన్ తండ్రి ఇదే జాతీయవాదంతో ఎన్నికల బరిలో ఉంటే ఇప్పుడు సాధించిన ఓట్లలో సగం మాత్రమే వచ్చాయి. ఈ క్రమాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల నాటికి అంటే 2022 నాటికి జాతీయవాదపార్టీ నేత లీ పెన్ పుం జుకున్నా ఆశ్చర్యం లేదు. అందుకే ఉమ్మడి మార్కెట్‌ను కోరుకునే ఈయూ అనుకూలవాదులు భయకంపితులవుతున్నారు. వాస్తవానికి ఈ సమస్య ఒక్క ఫ్రాన్స్‌ది మాత్రమే కాదు. యూరోపియన్ దేశాలు అమెరికా బహుళజాతి కంపెనీల ఆధిపత్యా న్ని ఎదుర్కోవటం కోసం ఆదరబాదరగా ఈయూ ను ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికా డాలర్‌ను ఎదుర్కోవటం కోసం యూరోను స ష్టించుకున్నా యి. కామన్ కరెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా యి. కానీ విభిన్న సామాజిక, సాంస్క తిక నేపథ్యా లు, అంతకుమించి ఆర్థిక అంతరాలున్న యూరప్ దేశాల మధ్య ఉమ్మడి మార్కెట్ మనగలుగుతుందా అనే అనుమానాలు ఆది నుంచీ ఉన్నాయి. ఈ దేశా ల మధ్య ఆధిపత్య విధానాల ఆందోళనలూ ఉన్నాయి. ఈ క్రమంలోంచే ఇటలీ, గ్రీస్, స్పెయిన్, బ్రిటన్‌లాంటి దేశాల్లో ప్రమాదకర పోకడలు కనిపిస్తున్నా ఈయూ పెద్దలు పట్టించుకోలేదు. ఇలాంటి నేపథ్యంలోంచే బ్రిటన్ ఈయూ నుంచి వైదొలిగింది. ఫ్రాన్స్‌లో మాక్రాన్ గెలుపుతో ఈయూ ఉనికికి ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకున్నా రానున్నది మాత్రం పరీక్షాకాలమే. ఫ్రాన్స్ చట్టసభకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష ఎన్నికలలో దెబ్బతిన్న నేషనల్ ఫ్రంట్ వచ్చే ఎన్నికల కోసం కాచుకున్నది. చట్టసభలో తమ బలగాన్ని నింపుకుంటేనే మాక్రాన్ తన విధానాలను అమలు చేయగలుగుతారు.
దేశాధ్యక్షుడిగా విజయం సాధించి, అదే ఊపులో చట్టసభ ఎన్నికలలోనూ తమ పార్టీని గెలిపించుకున్నా ఫ్రాన్స్‌ను ముందుకు నడుపడం మాక్రాన్‌కు అంత సులువేమీ కాదు. ఫ్రాన్స్‌లో తీవ్రమైన నిరుద్యోగం ఉన్నది. గత కొన్నేళ్లుగా అభివ ద్ధి స్తంభించిపోయింది. డోనాల్డ్ ట్రంప్ జాతీయ విధానంతో అధికారం హస్తగతం చేసుకున్నారు. స్థానికులకే ఉద్యోగాలు అంటూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో థెరీసా మే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేయటానికి ప్రయత్నిస్తున్నారు. వీరందరికి భిన్నంగా మాక్రాన్ ఈయూ అనుకూల విధానాలతో ప్రజానుకూల పాలన ఎలా అందిస్తారన్నదే పెద్ద ప్రశ్న. మాక్రాన్ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి గెలిచాడనే దానికన్నా లీ పెన్ వ్యతిరేకతతోనే గెలిచాడని చెప్పవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా జీడీపీలో ప్రజాసంక్షేమానికి కేటాయిస్తున్న దానిలో కోత విధించి ప్రజలను సంత ప్తిపర్చటం కత్తిమీద సామే. పింఛన్లు, విద్య, ఆరోగ్యనిధులలో కోత, ఉచిత శిశుసంరక్షణలో కోతలు తీవ్రమైన ప్రజావ్యతిరేకతను స ష్టించవచ్చు. ఈ మధ్య కాలంలో ఉగ్రవాద దాడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో విధించిన అంతర్గత ఎమర్జెన్సీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మధ్యేవాద ప్రజాస్వామిక ఆధునిక విధానాలకు ప్రతినిధిగా చెప్పుకున్న మాక్రాన్ ఎన్నిక ఈ యూ దేశాల అంతర్గత అనిశ్చితికి ఓ నిదర్శనమే. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నిక చెబుతున్న సత్యమిదే.


