ఉద్యోగుల్లో బదిలీల గోల
- 19 Views
- admin
- May 10, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విజయనగరం : ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీల గోల ప్రారంభమైంది. ఒకే చోట మూడేళ్ళ పైబడి పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయిదేళ్ళు ఒకే చోట పనిచేస్తున్న వారికి బదిలీలు తప్పనిసరి. బదిలీలు కోరుతూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంలో అన్ని శాఖల ఉద్యోగులు నిమగ్నమయ్యారు. తమకు అనుకూలమైన చోటుకి బదిలీలు చేయించుకోవాలన్న ఆశతో ఉన్నారు. అయిదేళ్ళు ఒకేచోట పనిచేస్తున్న వారు మరికొందరు తమ సీటుకు ఎసరు వస్తుందేమోనని భయపడుతునాఉ. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న చోటును విడిచి పెట్టి వెళ్లేందుకు వీరు ఇష్టపడడం లేదు. ఇలాంటి వారంతా రాజకీయ నేతలను, ఉన్నతాధికారులను ఆశ్రయిస్తూ తమకు స్థానచలనం కలగకుండా ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖల్లో అయిదేళ్ళు ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగుల జాబితాలను ఆయా శాఖలు సిద్ధం చేశాయి. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో దీర్ఘ కాలికంగా పనిచేస్తున్న ఉద్యోగులు మైదాన ప్రాంతాలకు తరలి రావాలని ఆశిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో ఎక్కువ కాలం పని చేసిన వారు ఏజెన్సీ ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి అంగీకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బదిలీల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందోనన్న ఆశక్తి ఉద్యోగుల్లో నెలకొంది.


