డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పని చేస్తున్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి (గేట్ 2017 స్కోర్ ద్వారా) అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: అణుశక్తి విడ్యుత్ ఉత్పత్తి, పంపిణీచేసే ప్రీమియర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ సంస్థ అయిన ఎన్పీసీఐఎల్ను సెప్టెంబర్ 17, 1987లో స్థాపించారు. ఈ కంపెనీ నినాదం మొదట భద్రత & ఉత్పత్తి తదుపరి. అణు టెక్నాలజీకి సంబంధించిన సైట్ సెలక్షన్, డిజైన్, కన్స్ట్రక్షన్, కమిషనింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్, రిన్నోవేషన్, మోడ్రనైజేషన్ అండ్ అప్ గ్రెడేషన్, ప్లాంట్ లైఫ్ ఎక్స్టెన్షన్, న్యూక్లియర్ రియాక్టర్‌కు సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ డీ కమిషనింగ్లను పర్యవేక్షిస్తుంది.
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
పనిచేసే ప్రదేశం: దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్పీసీఐఎల్ యూనిట్లలో
విభాగాలు: మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)లో ఉత్తీర్ణత. గేట్-2017 స్కోర్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
పేస్కేల్ : రూ. 24,900 – 50,500/-
ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
ఎంపిక: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2017 స్కోర్ ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
చివరితేదీ: మే 31
వెబ్సైట్: www.npcilcareers.co.in
ఎన్‌పీసీఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
- 12 Views
- admin
- May 10, 2017
- తాజా వార్తలు యువత
Categories

Recent Posts

