ప్రభాస్‌కు సరిజోడి
- 18 Views
- admin
- May 10, 2017
- తాజా వార్తలు సినిమా
బాలీవుడ్ జనాలు ప్రభాస్ మూవీ సాహో పై ఎక్కడలేని ఆసక్తిని ప్రద ర్శిస్తున్నారు. ఆ స్టోరీలోకి వెళితే, వంద కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో సాహో సినిమా తెరకెక్క బోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా స్టార్ట్ అయి అనేక క్రేజీ అప్డేట్స్ను బయటకు వది లింది. అయితే, ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం ఓ క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కు జోడీగా కన్నడ రైజింగ్ స్టార్ రష్మిక పేరు బాగానే వినిపిస్తున్నా.. ప్రస్తుతం తమన్నా, పరిణీతి చోప్రా తదితరుల పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు అసలు ప్రభాస్ పక్కన హీరోయిన్గా ఎవరిని చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారో తెలుసుకోవ డానికి.. బాలీవుడ్‌లోని కొన్ని ప్రముఖ వెబ్ సైట్స్ పోల్ నిర్వహించాయి. వాటన్నింటినీ తాజాగా వడ బోస్తే.. ప్రభాస్ పక్కన హీరోయిన్గా చాలామంది కత్రినా కైఫ్ వైపే మొగ్గుచూపడం విశేషం. ఈ సందర్భంగా హ్యాండ్సమ్ ప్రభాస్‌కు జోడీగా షీలా కీ జవానీ అంటూ తన కొలతల సొగసు లతో హీటెక్కించే కత్రినా కైఫ్ అయితే చాలా బాగుంటుందని ఏకంగా 49 శాతం మంది ఓటు వేయడం గమనార్హం. ఇక తర్వాతి స్థానం దీపికా పదుకునేకు దక్కింది. ఈ టాలెంటెడ్ బ్యూటీ ప్రభాస్ కు జోడీగా బాగుంటుందని 36 శాతం మంది ఓటేశారు. ఒకవేళ ప్రభాస్‌తో కత్రీనా నటిస్తే తెలుగు లో ఆమె మూడో సినిమా అదే అవుతుంది


