ప్రమాదంలో ఏపీ మంత్రి కొడుకు మృతి
- 19 Views
- admin
- May 10, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం

నిశిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న వెంటనే ఆయన హుటాహుటిన భారత్ బయలుదేరారు. అతివేగం, సీటు బెల్టు ధరించకపోవడంతో ప్రాణనష్టం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
లండన్ పర్యటనలో ఉన్న నారాయణకు షాకింగ్ న్యూస్
లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చేదు వార్త వినాల్సి వచ్చింది. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో డైరెక్టర్ గా గత ఏడాదే బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు నిషిత్ నారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించారన్న చేదు వార్త వినాల్సి వచ్చింది. కారు నెంబర్ టీఎస్ 07 ఎస్కే 7117 ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు…కారులో మరణించినది మంత్రి నారాయణ కారు అని తేలింది. కారు వేగంగా వచ్చి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిందని తెలిపారు. భారీ శబ్దం కావడంతో తాము నిద్రనుంచి లేచి చూశామని, అయితే కారులోంచి సీట్లు బయటకు వచ్చేసినంత వేగంతో ఆ కారు మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిందని తెలిపారు. గత రెండు రోజులుగా ఆ కారు తెల్లవారు జామున అతివేగంగా దూసుకువచ్చేదని వారు వెల్లడించారు. కాగా, ఎంతో భవిష్యత్ ఉన్న నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడంపై విచారం వ్యక్తం చేశారు.
Categories

Recent Posts

