అయ్యప్పస్వామి ఆలయ వారోత్సవాలు
- 14 Views
- admin
- May 11, 2017
- తాజా వార్తలు స్థానికం
గాజువాక, ఫీచర్స్ ఇండియా: జీవీఎంసీ 50వ వార్డు గంగవరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి ఆలయం మూడవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా 50వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులూ దొడ్డి రమణ కుమారి దంపతులు పాల్గుణి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించరు. అనంతరం దొడ్డి రమణ మాటలాడుతూ ఆలయవారో త్సవాలను ఇంత ఘనంగా నిర్వహించిన ఆలయకమిటీని అభినందించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వేకువ జామునుండి బారులుతీరారు. స్వామివారికీ పంచామత అభిషేకాలు, భజనలు నిర్వ హించరు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించరు.ఈ సమారాధన లో సుమారు 3 వేలమంది భక్తులు పాల్గుణి స్వామివారి ప్రసాదం స్వీకరించారు.ఈ కార్య క్రమంలో ఆలయకమిటీ ధర్మకర్త చిప్పల అప్పలరాజు, ప్రతినిథులు ఉమ్మడి శివ, వాకాడ ధనరాజ్, కారి పెంటయ్య, యారాబల సత్తిబాబు, పైడిరాజు, కె.అప్పారావు, బాపనయ్య, సత్యారావు మరియు చుట్టుపక్కల గ్రామా ప్రజలు పాల్గున్నారు.
విద్యార్థులకు ఉచిత రాజయోగ శిక్షణ తరగతులు ప్రారంభం
గాజువాక :వేసవి కాలంలో విద్యార్థులకు మూడురోజులపాటు ఉచితంగా రాజయోగ శిక్షణ తరగతులను ప్రారంభించునట్లు ప్రజాపిత బ్రహ్మ కుమారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం గాజువాక శాఖ ప్రతినిధులు విద్యార్థులకు వేసవి కార్యక్రమంలో భాగంగా రాజయోగ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ శిబిరానికి ముఖ్య అతిధిగా గాజువాక వర్తక సంఘము అధ్యక్షుడు తిప్పల చినఅప్పారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.అనంతరం అయన మాట్లాడుతూ విద్యార్థి దశలో అనుసరించే విధి, విధానాలే వారి బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమనం అవుతుందన్నారు. విద్యార్థులు అందరు రోజులో ఒక గంట యోగ చేయడం ద్వారా చైతన్యం కలిగి జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చు అని తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగించుకోవాలని కోరారు.ఇటువంటి తరగతులను నిర్వహిస్తున్న బ్రహ్మ కుమారీ సంస్థను అభినందించారు .ఈ కార్యక్రమలో బి కె మణి ,బి కె స్వాతి, అధిక సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గున్నారు .
ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై సంపూర్ణ విశ్వాసం
గాజువాక నియోజకవర్గంలో కాం గ్రెస్ పార్టీ గాజువాక నియోజక వర్గ ఇన్చార్జ్ మంత్రి రాజశేఖర్ సార థ్యంలో బలంగా వుంది అని సిటీ కాంగ్రెస్ ఉపాద్యక్షుడు జెర్రిపోతుల ముత్యాలు అన్నరు. పీసీసీ అధ్యక్షు లు ఎన్.రాఘవీరారెడ్డి ఆదేశాలమే రకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా గాజువాక నియోజవర్గంలోనున్న అన్ని వార్డులలో సుభ్యత్వా నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సుమారు నూరు పుస్తకాలు సభ్యత్వ నమోదుయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. అన్ని వార్డులలో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.సభ్యుత్వా నమోదును సరవేగంగా పూర్తిచేస్తున్న కార్యకర్తలను అభినందించారు. మనమందరం మంత్రి రాజశేఖర్ సారథ్యంలో కష్టపడి పని చేయాలని కోరేరు. ఈ పుస్తకాలను సిటి కాంగ్రెస్ కార్యాలంలో మంత్రి రాజశేకర్ చేతులమీదగా ఈరోజు రాఘవీరారెడ్డికి అందచేయునట్లు తెలిపారు.


