ఎంపీపీ నేనా ? నా భర్తా ? అధికారులపై ఎంపీపీ ఆగ్రహం
- 10 Views
- admin
- May 11, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
గరం గరంగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
అనకాపల్లి, ఫీచర్స్ ఇండియా : ఎంపీపీని నేనా ? లేక నా భర్తా ? ఎవరి ఆదేశాలు మీరు పాటించాలి ? ఎవరికి సమాచారం ఇవ్వాలి తెలుసుకుని మసలుకోవాలంటూ అధికారులపై ఎంపీపీ వ్యక్తం చేసిన ఆగ్రహమిది. అనకాపల్లి మండల పరిషత్ సమావేశం గురువారం గరం గరంగా సాగింది. సమావేశానికి హాజరైన అధికారులపై ఎంపీపీ కొణతాల వెంకటసావిత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ఆమె మట్లాడుతూ మండల పరిషత్ సమావేశాలకు అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడం సరికాదని అన్నారు. అలాగే మండల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తనకు అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వేరొకరి ద్వారా తెలుసుకుని అధికారులను ప్రశ్నిస్తే తన భర్త శ్రీనివాసరావుకు తెలిపామని తప్పించుకుంటున్నారని, ఎంపీపీ నేనా ? నా భర్తా అని ఆమె ప్రశ్నించారు. ఇకపై ప్రతి ఒక్క సమాచారం తనకు అధికారులు తెలియచెప్పాలని, లేకుంటే వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. అలాగే అధికారులు పనులపై వచ్చే ప్రజల నుంచి లంచాలు అశిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. ఒక రైతు పట్టాదారు పాసు పుస్తకం కోసం వస్తే రెవెన్యూ అధికారులు లంచం అడిగినట్లు తనకు ఫిర్యాదు వచ్చిందని అన్నారు. అలాగే ప్రతి ఒక్క ఎంపీటీసీ సభ్యుని దగ్గర నుంచి అధికారులు పనులు చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఏ పార్టీ అయినా ఎంపీటీసీ సభ్యులను గౌరవంగా చూడాలని అన్నారు. సమావేశానికి డుమ్మా కొడుతున్న అధికారులపై తాను జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
14న దువ్వాడ వద్ద గౌరీ ఓల్డేజ్ హోమ్ ప్రారంభం
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: మదర్స్ డే ను పురస్కరించుకొని ఈ నెల 14న దువ్వాడ రైల్వేస్టేషన్ వద్ద నూతనంగా నిర్మిం చిన గౌరీ ఓల్డేజ్ హోమ్‌ను ప్రారంభి స్తున్నట్లు విశాఖజిల్లా కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు మళ్ల గౌరీ శంకర్ తెలిపారు. గురువారం ఇక్కడ గవరపాలెం శ్రీగౌరీ పంచాయతన దేవస్థానంలో అనకా పల్లి శ్రీ గౌరీసేవా సంఘం అధ్యక్షుడు పెంటకోట సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధాప్యంలో పిల్లల ఆదరణ కరువై ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రుల వేదనను గమనించి ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని తమ కుమార్తెలు తలపెట్టార న్నారు. అందులో భాగంగా తమ కుమా ర్తెలు భీశెట్టి పల్లవిగణేష్, ఆళ్ల షణ్ముఖేశ్వరి, డాక్టర్ మళ్ల నవీన్‌లు దువ్వాడ సమీపం మంగలపాలెం గ్రామంలో ఉన్న 250 గజాల స్థలాన్ని విశాఖజిల్లా కేంద్ర గౌరీ సేవా సంఘానికి విరాళంగా అందజేశా రన్నారు. సంఘం నిర్మాణ బాధ్యతలను చేపట్టి స్వచ్ఛందంగా విరాళదాతలు అంద జేసిన 25 లక్షల రూపాయలతో ఈ వృద్ధా శ్రమాన్ని నిర్మించామన్నారు. వృద్ధాశ్రమం వృద్ధులకు ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం కల్పిస్తుందన్నారు. భవిష్యత్తు లో ఉచిత వైద్యం అందించాలనే దృక్పథం తో ఉన్నట్లు ఆయన చెప్పారు. గవర జాతీయుల కోసం ప్రత్యేకంగా ఈ వృద్ధాశ్ర మాన్ని నిర్మించినట్టు ఆయన చెప్పారు. పిల్లల ఆదరణ నోచుకోని గవర కులానికి చెందిన వృద్ధులకు ఈ ఆశ్రమం బాసటగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ఆశ్రమ నిర్వహణకు విరాళం ఇచ్చే దాతలు నేరుగా గాని, చెక్కుల ద్వారా గాని అందజేయవ చ్చునని ఆయన చెప్పారు. ఆదివారం జరగనున్న ఈ వృద్ధాశ్రమం ప్రారంభో త్సవ కార్యక్రమానికి గాజువాక నియోజక వర్గం శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై ఆశ్రమాన్ని ప్రారంభిస్తా రన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథు లుగా అనకాపల్లి శాసనసభ్యుడు పీలా గోవింద సత్యనారాయణ, విశాఖ పశ్చిమ నియోజకవర్గంం శాసనసభ్యులు పెతకం శెట్టి గణబాబు, మాజీ శాసనసభ్యులు మళ్ల విజయ్‌ప్రసాద్ పాల్గొంటారన్నారు. విజయ నగరం జిల్లా నుంచి కృష్ణా జిల్లాల్లో ఉన్న గవర జాతీయులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని గౌరీశంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గౌరీ సేవా సంఘం ఉపాధ్యక్షుడు దొడ్డి రామారావు, సంయుక్త కార్యదర్శులు మళ్ల సత్యనారాయణమూర్తి, కొణతాల శ్రీను, కాండ్రేగుల మహలక్ష్మినా యుడు, కార్యనిర్వహక కార్యదర్శి వేగి సత్యనారాయణ, ప్రత్యేక ప్రతినిధి బొడ్డేడ ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మిక శ్రామిక వికాస్ సంఘట్ కన్వీనర్‌గా కృష్ణమూర్తి
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మిక శ్రామిక వికాస్ సంఘ ట్ కన్వీనర్‌గా సీహెచ్. కృష్ణ మూర్తి నియమితులయ్యారని ఆమ్ ఆద్మీ పార్టీ అనుబంధ శ్రామిక వికాస్ సంఘట్ రాష్ట్ర అధ్యక్షుడు యజ్ఞ నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంద ర్భంగా శుక్రవారం విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్‌గేటు వద్ద ఐదువేల మంది కార్మికులకు కాలుష్య నియంత్రణ మాస్క్‌లను పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కార్మికులంతా విజయవంతం చేయాలని యజ్ఞ నారాయణ కోరారు. కృష్ణమూర్తి నియామకం పట్ల అనకాపల్లి నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరనాథబాబు, మావూరి రవికుమార్, కె.గణేష్ బాబు, అడ్లబోయిన నారాయణరావు, కాండ్రేగుల రామకృష్ణ, మాణిక్యాలరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


