గిరిజనులకు అన్యాయం జరిగితే సహించం.. గిరిజన సంఘాల చర్చావేదికపై నాయకులు
- 33 Views
- admin
- May 11, 2017
- తాజా వార్తలు స్థానికం
విజయనగరం,ఫీచర్స్ ఇండియా: రాష్ట్రంలో ఏ ఒక్క గిరిజనుడికి అన్యాయం జరిగినా సహించబోమని పలువురు గిరిజన నాయ కులు, ఎమ్మెల్యేలు అన్నారు. అమర్భవన్ లో ఎపి గిరిజన సమాఖ్య ఆధ్వర్యాన గిరిజన సంఘాల ఐక్యవేదిక చర్చా వేదిక జరిగింది. తమ్మి అప్పలరాజు దొర అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర మాట్లాడుతూ గిరిజనులు కాని వారు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, పదవులు పొందుతున్నారని, ఇటువంటి వాటిని అరికట్టాల్సి ఉందని అన్నారు. బడ్జెట్లో గిరిజనులకు కేటాయి స్తున్న నిధులను వారికే ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గిరిజన సంక్షేమశాఖ మంది పదవిని గిరిజనులకే ఇవ్వాలని అన్నారు. ఇటీవల ఆర్పి భంజ ్దేవ్ ఎస్టియేనని కలెక్టర్ సర్టిఫై చేసిన విషయంపై గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యా దు చేస్తానని తెలిపారు. జిల్లా పరిశీలన కమిటీ ఇచ్చిన నివేదికను కాదని భంజ్‌దేవ్ ఎస్టియేనని కలెక్టర్ ఎలా నివేదిక ఇస్తార ని ఆయన ప్రశ్నించారు. ఇటీవల కాలంలో శాసనసభలో తాగునీరు, రోడ్లు, విద్య తదితర సౌకర్యాల కల్పన కోసం స్పీకర్‌కు, ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై ఐక్యంగా పోరాడాలని అన్నారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. జిల్లాకో గిరిజన భవనం, విజయ నగరంలో గిరిజన యూనివర్శిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను విడదీస్తే కొంతవరకు గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలక లక్ష్మణమూర్తి మాట్లా డుతూ చదువుకున్న గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించాలని, గిరి శిఖర గ్రామాలో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. రాష్ట్రంలోగల అన్ని గిరిజన సం ఘాలు ఒక తాటిపైకి వచ్చి పోరాడాల న్నారు. మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ మాట్లాడుతూ ఎవరు ఏ పార్టీలో ఉన్నా హక్కులను కాపాడుకోవాలని అన్నారు. సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు మాట్లా డుతూ గిరిజనులంతా ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టి కమిషన్ ఏర్పాటు చేయాలని, మైదాన ప్రాంత గిరిజనులకు రుణాలు మం జూరు చేయాలని అన్నారు. కార్యక్ర మంలో ఆలుగు వెంకటరావు, పాడి రమేష్, లోవరా జు, బడ్నాన శ్రీను, అమర్నాధ్, మంచాల పారమ్మ, బంగారుదొర పాల్గొన్నారు.


