జైపూర్ : రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఓ పెళ్లి వేడుకలో మంగళవాయిద్యాలు మోగాల్సింది పోయి.. చావు డప్పు మోగింది. వివాహం జరుగుతున్న సమయంలో భారీ తుపాను వచ్చింది. పెళ్లి వేడుక పక్కనే ఉన్న గోడ వద్దకు పలువురు వెళ్లారు. తుపాను కారణంగా గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, 11 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గోడ పక్కనే పెళ్లి వంటకాలు చేయడంతో అవి కూడా పాడయ్యాయి. పెళ్లి వేడుకలో మృతి చెందిన కుటుంబాలకు రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సంతాపం ప్రకటించారు.