నందిగామ: ఆగిఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని బైపాస్ రహదారిపై గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇండికా కారులో ఐదుగురు హైదరాబాద్వైపు నుంచి కర్నూలుదిశగా వెళుతుండగా ఎమ్ఎస్ఎన్ ఫార్మా పరిశ్రమ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కారు పూర్తిగా లారీ వెనక భాగంలోకి చొచ్చుకుపోవడంతో మృతదేహలను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.