‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నాలుగవ సీజన్ అట్టర్‌ఫ్లాప్ అనేది తెలిసిన విషయమే. చిరంజీవి బుల్లితెర ఎంట్రీ మెగా సక్సెస్ అవుతుందని అనుకుంటే, ఆరంభం నుంచే ఇది డిజాస్టర్ దిశగా సాగింది. ఆల్రెడీ బోర్ కొట్టేసిన కాన్సెప్ట్‌ని తీసుకుని చిరంజీవి టెలివిజన్ రంగంలోకి రావడం పెద్ద మిస్టేక్ అయింది. ఎన్ని విధాలుగా టీఆర్పీలు పెంచడానికి చూసినా కానీ మీలో ఎవరు కోటీశ్వరుడు ఏ దశలోను పుంజుకోలేకపోయింది.
అయితే మొదటి సీజన్ పూర్తి చేయడం బాధ్యతగా తీసుకుని చిరరజీవి దానిని కొనసాగించారు. ఈ నెలతో మొదటి సీజన్ పూర్తవుతుంది. నిజానికి సెప్టెంబర్‌లో మళ్లీ సీజన్ స్టార్ట్ చేయాల్సి వుంది కానీ అది ఇక జరగదని అంటున్నారు. సెప్టెంబర్ నుంచి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’కి చిరంజీవి డేట్స్ కేటాయించారు. ఏకధాటిగా వచ్చే మార్చి వరకు షూటింగ్ జరుగుతుంది నుక వచ్చే ఏడాది మే వరకు చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కి అందుబాటులో వుండరు.
మూడు సీజన్లు చేయడానికి ఒప్పందం చేసుకున్న మెగాస్టార్ ఇక్కడితో దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని, కొత్త ప్రోగ్రామ్ ఏదైనా ప్లాన్ చేద్దామని మా నెట్‌వర్క్‌తో చెప్పారని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి ఫ్రీ అయ్యేలోగా కాన్సెప్ట్స్ వర్క్ చేసి మెగాస్టార్ స్థాయికి తగ్గ షో సెట్ చేయాలని మా బృందం కృషి చేస్తున్నట్టు సమాచారం.