జిల్లాకే ‘రాజకుమారి’ ఈ అధికారి
- 9 Views
- admin
- May 13, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : ఆమె నిజంగా ‘రాజకుమారి’నే. వచ్చామా, వెళ్లామా’ అన్న రీతిలో ఉండే అత్యధిక మంది ప్రభుత్వ అధికారుల్లా కాకుండా ఆమె తీరే వేరు. పనిలో ఆమె కాంతిమతి. పలకరింపులో శాంతిమతి. ఒక్కమాటలో చెప్పాలంటే పాలనా నాయకత్వానికి రాజకుమారి ఒక ప్రతీకగా నిలిచారు. ఏదైనా మహిళకే సాధ్యం. మహిళలైతేనే ఇలా చేయగలరని ఆమె మరో సారి నిరూపించారు. అందుకే నేమో బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే అటు రాష్ట్ర ఉన్నతాధికారుల మన్ననలు పొం దడంతో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పడ్డారు. సాధారణంగా పనిమంతులని ఎవరూ వదులుకోలేరు. పైగా నమ్మ కంగా పనిచేసే పనిమంతులు దొరకడం చాలా కష్టం. అందుకే రాజకుమారిని వదులుకునేందుకు ఎవరూ చొరవ చూపలేదు. ఆమెకి బదిలీ అయినా సరే, వెంటనే ఆపేసారు. ఆ అభిమానానికి, నమ్మకానికి రాజకుమారి సైతం తలవంచక తప్పలేదు.
ఎవరీ రాజకుమారీ !
రాజకుమారిగా అన్ని వర్గాల వారికి సుపరిచితురాలైన ఈమె జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఒ)గా ప్రస్తుతం అధికార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. విశేషం ఏమిటంటే జిల్లాలో విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఆమె ఉద్యోగపర్వం ప్రారంభమైంది. పదోన్నతిపై ఆమె జెడ్పీ సీఈవో స్థాయికి ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆమె సహజ స్వభావం. అదే ఆమెకు మరింత పేరు తెచ్చింది. అధికార వర్గాల్లో గుర్తింపు తీసుకువచ్చింది. నిరాడంబరం, నింపాదితనం, మానవతావాదం, అన్నింటికీ మించి ప్రజాసేవే పరమావధిగా భావించే తత్వం రాజకుమారి పనితనానికి మరింత వన్నె తెచ్చాయి. తోటి అధికారులతో కలివిడితనం, ఉన్నతాధికారులతో సత్సంబంధాలు, ప్రజలతో సంబంధాలు రాజకుమారికి కలిసి వచ్చాయి. ప్రజలెవరైనా ఆమె దగ్గరకి సులువుగా వెళ్లొచ్చు. తమ బాధను చెప్పుకోవచ్చు. కొంతమంది అధికారుల్లాగా ఆమె భేషజాలకు పోరు. ఎవరొచ్చినా అప్పాయింట్మెంట్ ఉన్నా లేక పోయినా క్షణంలో తనను కలిసే అవకాశం ఇస్తారు. అంతేకాదు. ఏదైనా క్షణంలో తనను కలిసే అవకాశం ఇస్తారు. అంతేకాదు ఏదైనా మీటింగ్ కు వెళ్లాల్సివస్తే వచ్చిన బాధితుల గోడు ఆలకించి త్వరగా పంపించి వేస్తారు. అంతే తప్ప ఎవరి కోసం ఉండరు. అన్న థోరణిలో గంటల తరబడి నిరీక్షించనివ్వరు. అందుకే ప్రజల్లో కూడా రాజకుమారి అంటే ఒక విధమైన అనుబంధ సంబంధమే. కలిసిపోయే తత్వం, కలుపుకునే మనస్తత్వమే ఆమెను అటు అధికార వర్గంలోను, ఇటు ప్రజల్లోను ఓ అజాతశత్రువుగా నిలిపింది. ప్రజలు పాలిట ఆత్మ బంధువు అయ్యింది. ప్రభుత్వం కూడా ముఖ్యమైన పనులను ఆమెకే అప్పగించడం ఆనవాయితీగా మారింది. ఏ పనైనా క్షేత్రస్థాయినుంచి పరిశీలించి, స్వీయ పర్యవేక్షణ చేయడం ఆమెకు ఆ గుర్తింపును తెచ్చింది.
అష్టావధానం :
పనిలో ఆమె నిజంగా రాజానే. ఒక విధంగా చెప్పాలంటే బాధ్యతల విషయంలో రాజకుమారి అష్టావధానం చేస్తున్నారనే చెప్పాలి. జెడ్పీ సీఈవోతో పాటు ఇతర ఉద్యోగ బాధ్యతలను కూడా రాజకుమారికే అప్పగించారు. గ్రామీణ అభివృద్ధిలో అధికారిగా, చీపురుపల్లి ఆర్ఎసి అధికారిగా కూడా ఇన్ఛార్జి బాధ్యతలను రాజకుమారి నిర్వహిస్తున్నారు. శాఖలో సాధారణ పాలనలో పాటు, అభివృద్ధి అభివృద్ధి పనులను అమలు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దత్తత తీసుకున్న విజయనగరం మండలంలోని ద్వారపూడి గ్రామానికి ప్రత్యేక అధికారిగా రాజకుమారి వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే ద్వారపూడిలో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి గ్రామసభలో అంతా తానై నడిపించి నేరుగా సిఎం దృష్టిలో పడ్డారు. ఇన్ని శాఖలకు అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నా ఆమెలో అదే చురుకుదనం, అంకిత భావం, ఉన్న సమయాన్నే అన్ని శాఖల పాలనకు కేటాయిస్తూ, సంబంధిత ఉద్యోగుల మధ్య సమన్వయం సాధిస్తూ, ఆశించిన దానికంటే ఎక్కువగా ఫలితాలను సాధిస్తూ ‘దటీజ్ రాజకుమారి’ అనిపించారు.
వదల బొమ్మాళీ..
ఇంతటి పనిమంతురాలు కావడంతోనే జిల్లా రాజకుమారిని వదలనుగాక వదలనంటోంది. అటు జిల్లా అధికారులు, ఇటు పాలక ప్రతినిధులు సైతం ఆమెను మరో జిల్లాకు వెళ్ళనీయడం లేదు. వేసవి సెలవుల దృష్ట్యా ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అధికారులు బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.జిల్లాకు చెందిన పలువురు అధికారులకు బదిలీ అయ్యింది. రాజకుమారికి కూడా బదిలీ అయ్యింది. కానీ రాజకుమారి బదిలీని యంత్రాంగం నిలిపేసింది. దీన్ని బట్టి జిల్లాలో రాజకుమారి పనితనం ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. ఆమె కూడా అంతే సున్నితంగా, సునిశితంగా స్పందించారు. అందుకే అధికారుల్లో ఆమె నిజంగా ‘రాజకుమారి’నే అనడం సర్వసమ్మతం.


