క్యాన్సర్‌కు భయపడాల్సిన అవసరం లేదు.. మంత్రి గంటా శ్రీనివాసరావు
- 13 Views
- admin
- May 15, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : అత్యాధునిక వైద్య విధానం అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్‌కు భయ పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. నగరంలోని నొవోటెల్ హోటల్లో ‘బెస్ట్ ఆఫ్ ఆస్ట్రో 2017’ పేరిట నిర్వహించిన రెండు రోజుల సదస్సు లో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసం గించారు. క్యాన్సర్ నయానికి మనోధైర్యం అవసరమని సూచించారు.
ఏడాదికేడాది క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుండగా, దీనికి వంశపారపర్యంతో పాటు జీవనశైలి లో మార్పులు కారణమన్నారు. జీవనశైలి తో పాటు ఆహర నియమాల్లో మార్పులు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ మహమ్మారి నుంచి దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు. సినీ నటి గౌతమి, మనీషా కోయిరాలా, యువరాజ్ సింగ్ వంటి వారికి క్యాన్సర్ సోకినా, వారు క్యాన్సర్‌ను జయించి, సాధారణ జీవనం సాగిస్తున్నా రని, వారిని స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సినీ నటి గౌతమి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉంటే, దానిని సులువుగా జయించవచ్చ న్నారు. ప్రస్తుతం అత్యాధునిక వైద్య విధా నం అందుబాటులో ఉందని, ఎవరూ భయ పడాల్సిన అవసరం లేదని తెలిపారు. క్యాన్సర్‌ను జయించిన తాను గుందె ధైర్యంతో, వైద్యులు చెప్పినవన్నీ చేయడం ద్వారా ప్రస్తుతం సాధారణ జీవనం సాగిస్తున్నానని తన అనుభవాలను వివరిం చారు. క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆస్పత్రి ఛైర్పర్సన్ డాక్టర్ చలసాని విజయక్ష్మి మాట్లాడుతూ బెస్ట్ ఆఫ్ ఆస్ట్రో 2017 సదస్సులో క్వీన్స్ఎన్ఆర్ఐ ఆస్పత్రి ఒక భాగం కావడం ఆనందంగా ఉందన్నారు.
1995లో 40 పడకలతో ప్రారంభమైన ఆస్పత్రి ప్రస్తుతం 330 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చెందిందని వివరించారు. స్వర్గీయ డాక్టర్ చలసాని రంగారావు గారు ఇంత పెద్ద ఆస్పత్రిని నిర్మించారని తెలి పారు. క్యాన్సర్‌తో పాటు వివిధ అనారో గ్యాలకు సంబంధించి అవగాహన కార్యక్ర మాలు క్వీన్స్ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిర్వహిసు ్తన్నాట్లు వివరించారు. ఆంకాలజిస్ట్ డాక్టర్ హిమబిందు గడ్డిపాటి, బెస్ట్ ఆఫ్ ఆస్ట్రో కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బి. రవిశంకర్, కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ విజయానందరెడ్డి, ఎరాయ్ కార్యదర్శి డాక్టర్ గిరి, పలువురు వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు.


