వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చినట్టు వార్తలొస్తున్నాయి. త్వరలో నాని, నాగార్జున కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తున్నారని ఫిలింనగర్లో వినిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇంకా బయటకి రాలేదు కానీ ఈ చిత్రం చేయడానికి నాగార్జున, నాని ఇద్దరూ సమ్మతించారని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.
ఊపిరి తర్వాత ‘రాజు గారి గది’ చిత్రంలో యువ నటులతో కలిసి చేస్తోన్న నాగార్జున నెమ్మదిగా మల్టీస్టారర్ల వైపు వెళుతున్నారు. తన వయసుకి సూటయ్యే సోలో హీరో కథలు ఎక్కువగా రాకపోవడంతో గ్యాప్ తీసుకోవడం ఇష్టం లేక యువ నటులతో కలిసి నటించడానికి మొగ్గు చూపుతున్నారు. నిఖిల్‌తో ఒకటి, నాగచైతన్యతో ఒకటి చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ అవి ఇంకా మెటీరియలైజ్ కాలేదు.
ప్రస్తుతం నాని చేతిలో చాలా చిత్రాలున్నాయి. నిన్ను కోరి త్వరలో విడుదలకి సిద్ధమవుతూ వుండగా, దిల్ రాజు బ్యానర్లో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి నాని కమిట్ అయ్యాడు. నాగార్జునతో నాని చిత్రం బహుశా వచ్చే ఏడాదికి సెట్స్ మీదకి వెళుతుందేమో.
నానికి నాగార్జున సపోర్ట్
- 17 Views
- admin
- May 15, 2017
- తాజా వార్తలు సినిమా
– See more at: http://telugu.gulte.com/tnews/20804/A-Multi-Starrer-From-Nani-Nagarjuna#sthash.s4QnwUjh.dpuf
Categories

Recent Posts

