నిర్భయంగా బతుకునిద్దాం
మన ఆడపిల్ల బయటికి వెళ్తే మనం ఎంత భయపడతామో.. పక్కింటివాళ్లు కూడా వాళ్ల కూతురు బయటికి వెళ్తే అంతే భయపడతారు. భయపడితే లాభం లేదు. రేపటితరాన్ని తీర్చిదిద్దేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే..! ఆ తరానికి సత్ప్రవర్తన నేర్పాల్సిందీ వారే!! అలా నేర్పిననాడే మన ఆడపిల్లలకు బతుకు!!
2012 డిసెంబర్ 16.. యావత్ భారతావనిని నిర్ఘాంతపర్చిన ఘటన! ఆ రోజు రాత్రి 9 గంటలు.. ఢిల్లీలో సినిమా చూసి స్నేహితుడితో కలిసి ఇంటికి బయలుదేరింది 23 ఏండ్ల పారామెడికల్ విద్యార్థిని. ఆటోలు, టాక్సీల మీద నమ్మకం లేక.. ఇద్దరూ బస్సెక్కారు. బస్సు కదులుతూ ఉంది. ఆ బస్సులో మాటేసిన ఆరుగురు నరరూప రాక్షసులు అక త్యానికి తెగబడ్డారు. యువతి స్నేహితు డిని బంధించి, చావబాది.. ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. మానవత్వానికే మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిం చారు. ఇద్దరినీ బస్సులోంచి బయటకు తోసి, పారిపోయారు. ఆ తర్వాత బాధితురాలు దవాఖానలో చికిత్సపొందుతూ పదమూడు రోజులకు తుదిశ్వాస విడిచింది. ఈ పైశాచికతపై అప్పట్లో ఢిల్లీ మాత్రమే కాదు.. దేశమంతా దద్దరిల్లింది.
కన్నబిడ్డలను గుర్తుచేసుకొని ఎందరో తల్లిదండ్రులు రోడ్లమీదికి వచ్చారు. తోడబుట్టిన అక్కాచెల్లెండ్లలో నిర్భయను చూసుకొని ఎందరో యువకులు కదిలారు. యువతులు ముందుండి నడిపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు నిందితులను పట్టుకోవడం.. దాంట్లో ఒకడు జైల్లో ఉరేసుకొని చనిపోవడం.. మరొకడు మైనర్ అయిన కారణంగా మూడేండ్ల శిక్ష అనుభవించి బయటకు రావడం.. మిగిలిన నలుగురికి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునివ్వడం జరిగిపోయింది. ఈ తీర్పును హైకోర్టు సమర్థించగా.. దోషులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దోషులు.. బాధితురాలిని విలాస వస్తువుగా చూశారు. ఉన్మాదుల్లా చెలరేగారు, తెగబడ్డారు. ఇలాం టి అత్యంత హేయమైన, అమానవీయఘటన కేసులో మరణశిక్ష విధించలేనప్పుడు మరే ఇతర ఘటననూ మరణశిక్ష కింద పరిగణించలేం.. అని.. పదిరోజుల క్రితం (ఈ నెల 5న) సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెబుతూ చేసిన ఈ వ్యాఖ్యలు చాలు ఘటన తీవ్రతను తెలుసుకోవడానికి. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది.
అందుకే నాలుగున్నరేండ్లుగా పోరాడుతున్నాం. దోషులకు శిక్ష అమలయ్యేదాకా పోరాటం చేస్తాం. నా బిడ్డకు జరిగిన అన్యా యం ఏ బిడ్డకూ జరుగొద్దు.. తీర్పు అనంతరం నిర్భయ తల్లి ఆశాదేవి నుంచి వచ్చిన ఈ మాటలు ప్రతి ఆడబిడ్డ తండ్రికి, అమ్మ కడుపు నుంచి వచ్చే ప్రతి బిడ్డకూ సూార్తిేదాయకం. రెండు, మూడు గంటల్లో ఇంటికి తిరిగివస్తానన్న బిడ్డ రాలేదు. దవాఖానలో ఉందని తెల్లవారుజామున ఎవరో ఫోన్ చేస్తే వెళ్లాం. శరీరమంతా పైపులు.. కమిలిపోయిన ముఖం.. కంటిరెప్ప కూడా తెరి చే స్థితిలోలేని బిడ్డను చూసి నా గుండె పగిలింది. వాళ్ల నాన్న జీవఛవేమయ్యారు. అమ్మా.. నీళ్లు తాగుతానని బిడ్డ సైగచేస్తే.. డాక్టర్లు వద్దన్నారు. శరీరంలో అన్నీ భాగాలు దెబ్బతిన్నాయి.. నీళ్లు తాగిస్తే ప్రమాదమన్నారు.
13 రోజులు బిడ్డ దగ్గరే ఉన్నాను. ఈ చేతుల్లోనే.. కండ్ల ముందే కన్నుమూసింది. కనీసం బిడ్డకు గుక్కెడు నీళ్లు తాగించలేని దౌర్భాగ్యం ఆ తల్లిది.. ఈ దుస్థితి ఏ కన్నతల్లికీ రావొద్దు.. ఉబికివస్తున్న కన్నీటిని పంటిబిగువన ఆపుకొని ఆశాదేవి చెబుతుంటే అక్కడి వారందరి కండ్లు చెమర్చాయి. ఆ పారామెడికల్ విద్యార్థిని బతికుంటే.. మార్చి 10న 28వ పుట్టినరోజు జరుపుకొనేది. భౌతికంగా బిడ్డ లేకపోయినా.. బిడ్డ జ్ఞాపకాల్లోనే ఆశాదేవి బతుకుతున్నది. బిడ్డ రాక కోసం ఆ తల్లి కండ్లు ఎదురుచూస్తూనే ఉన్నాయి.
ఆడపిల్లను బతకనివ్వరా..?! రోడ్డుమీదికి ఆడబిడ్డ వస్తే పశువుల్లా పీక్కుతినే చూపులతో చిత్రహింసలకు గురిచేసే లోకం తీరు మారదా..? ఢిల్లీలోనే కాదు.. మన గల్లీలో కూడా.. నిత్యం ఎక్క డో చోట అక త్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానా లో వెలుగుచూసిన ఉదంతం మనుషుల మధ్యే మనం ఉన్నామా అనిపిస్తున్నది. విధులకు వెళ్తున్న యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు.. సామూహిక లైంగికదాడికి పాల్పడి, ఆపై యువతిని ముక్కలుముక్కలుగా కొసి, వాహనంతో తొక్కించడం.. కిరాతకానికే కిరాతకం. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా లైంగికదాడుల కేసులు 2010లో 22,172బీ 2011లో 24,206బీ 2012లో 24,923బీ 2013లో 33,707, 2014లో 36,735, 2015లో 34,651 నమోదయ్యాయి. ఇవి కాగితాల్లో ని లెక్కలు మాత్రమే.. ఇంకా లెక్కలకురాని అక త్యాలు ఎన్నో..! పోలీస్‌స్టేషన్‌కు పోతే న్యాయం మాట అటుంచి.. పరువుపోతుందనే భయంతో బాధను ఇంటిగోడ దాటనివ్వని తల్లిదండ్రులెంద రో.. ఆడబిడ్డలెందరో..? 2012 డిసెంబర్ 16 ఘటన తర్వాత లైంగికదాడుల కేసులు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ కేసుల సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేసినా.. ఆడబిడ్డలకు అభయంగా నిఠయే నిధిని తీసుకువచ్చినా.. నిఠయే చట్టం కింద దోషులకు 20 ఏండ్లు శిక్షలు విధించినా.. నేరాలకు ఏ మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. కారణం..?
ఇంటి నుంచి ఆడపిల్ల బయటకు అడుగుపెట్టగానే తల్లి కండ్లన్నీ గడప వైపే చూస్తాయి. బిడ్డ ఎప్పుడొస్తుందో.. ఎట్లొస్తుందోననే భయం! తండ్రికీ అదే భయం!! బిడ్డ క్షేమంగా తిరిగిరావాలని ప్రతి తల్లిదండ్రీ కోరుకోవడం సహజం. కానీ.. ఎన్నాళ్లిలా భయంభయంగా ఎదురుచూడటం? ఆడబిడ్డ రక్షణకు మార్గమే లేదా?! పేదరికం, యుక్తవయసులో శిక్షపడటం, జైలులో సత్ప్రవర్తన కలి గి ఉండటం వంటి కారణాలు దోషుల నేరప్రవర్తనను తగ్గించలేవు. సమాజంలో మార్పు రావాలంటే చట్టాలు మాత్రమే సరిపోవు.. చుట్టూ పరిసరాల్లో మార్పు రావాలి. మగవారితో సమానంగా ఆడవారినీ గౌరవించాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలి. ఉపాధ్యాయులు బోధించాలి. ఈ అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి.. నిఠయే కేసులో విడిగా తాను రాసిన తీర్పులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతి ప్రస్తావించిన వ్యాఖ్యలివి. మన కూతురు బయటికి వెళ్తే మనం ఎంత భయపడతామో.. పక్కింటివాళ్లు కూడా వాళ్ల కూతురు బయటికి వెళ్తే అంతే భయపడతారు. భయపడితే లాభం లేదు. రేపటితరాన్ని తీర్చిదిద్దేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే..! ఆ తరానికి సత్ప్రవర్తన నేర్పాల్సిందీ వారే! అలా నేర్పిననాడే మన బతుకమ్మలకు బతుకు!!


