ఎగుమతుల్లో హైజంప్
- 12 Views
- admin
- May 16, 2017
- జాతీయం తాజా వార్తలు
న్యూఢిల్లీ: దేశీయ ఎగుమతులు భారీగా పుంజుకున్నాయి. పెట్రోలియం, టెక్స్టైల్స్, ఇంజినీరింగ్ గూడ్స్లతోపాటు జెమ్స్ అండ్ జ్యూవెల్లరీలకు విదేశాల్లో డిమాండ్ నెలకొనడంతో గడిచిన నెలలో ఎగుమతుల్లో రెండంకెల వద్ధి నమోదైంది. ఏడాది ప్రాతిపదికన 19.77 శాతం పెరిగి 2,463 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. గడిచిన నెలకుగాను 49.07 శాతం ఎగబాకి 3,788 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. 2016 ఏప్రిల్ నెలలో దిగుమతులు 2,540 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్యలోటు(ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం) మూడింతలు పెరిగి 1324 కోట్ల డాలర్లకు చేరుకోవడం కొంత కలవరానికి గురి చేస్తున్నదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో 484 కోట్ల డాలర్లుగా ఉంది లోటు. ప్రధానంగా పసిడి, క్రూడాయిల్ దిగుమతులు అంచనాలకుమించి పెరగడం వల్లనే లోటు పెరగడానికి ప్రధాన కారణమని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మార్చిలోనూ రెండింతల వ ద్ధి నమోదైన ఎగుమతుల్లో ఆ తర్వాతి నెలలో కూడా ఇదే స్థాయి పనితీరు కనబరిచింది. గడిచిన నెలల్లో పెట్రోలియం ఉత్పత్తుల 48.77 శాతం వ ద్ధిని నమోదు చేసుకోగా, టెక్స్టైల్స్ 31.72 శాతం, ఇంజినీరింగ్ గూడ్స్ 28.21 శాతం, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతుల్లో 15 శాతం చొప్పున పెరిగాయి. వీటితోపాటు కెమికల్స్, ఖనిజం, సముద్ర ఉత్పత్తులు, నూనె వంటలు, ప్లాస్టిక్, జీడిపప్పు కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. గడిచిన నెలలో చమురు దిగుమతులు ఏడాదిప్రాతిపదికన 30.12 శాతం పెరిగి 735 కోట్ల డాలర్లకు చేరుకోగా, చమురేతర ఉత్పత్తుల దిగుమతి 54.50 శాతం ఎగబాకి 3052 కోట్ల డాలర్లకు చేరింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతుల్లో 4.71 శాతం వ ద్ధి నమోదైన 27,464 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 26,230 కోట్ల డాలర్లుగా ఉంది. చమురు దిగుమతి స్వల్పంగా తగ్గి 38,030 కోట్ల డాలర్లుగా నమోదైంది. వాణిజ్యలోటు 11,870 కోట్ల డాలర్ల స్థాయి నుంచి 10,570 కోట్ల డాలర్లకు పడిపోయింది. వస్తు, సేవా పన్ను(జీఎస్టీ) అమలులోకి రానుండటం, విదేశీ ఎగుమతుల పాలసీల్లో మార్పులకు శ్రీకారం చుట్టడంతో ఏడాది ఎగుమతులకు మరింత బూస్ట్‌నివ్వనున్నదని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా వెల్లడించాయి.
దేశవ్యాప్తంగా అనూహ్యంగా అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొంది. దీంతో గడిచిన నెలలో పసిడి దిగుమతి ఏడాది ప్రాతిపదికన మూడు రెట్లు పెరిగి 385 కోట్ల డాలర్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో దిగుమతి 123 కోట్ల డాలర్లుగా ఉంది. అక్షయ త తీయ సందఠంగా గడిచిన నెలల్లో భారతీయులు అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేశారు. గతేడాది ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో అతి విలువైన లోహాల దిగుమతి తగ్గుముఖం పట్టింది. అక్టోబర్-నవంబర్ నెలలో పెరిగినప్పటికీ ఆ తర్వాత డిసెంబర్-జనవరి నెలల్లో తగ్గుముఖం పట్టింది. వెండి దిగుమతులు కూడా 61 శాతం పెరిగి 353 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గడిచిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్యకాలంలో భారత్ 560.32 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. దేశవ్యాప్తంగా పండుగ సీజన్‌కు పెళ్లిళ్ల సీజన్ కూడా తొడవడంతో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొందని ఐక్రా లిమిటెడ్ వెల్లడించింది.


