చిదంబరం ఇంట్లో సీబీఐ సోదాలు
- 22 Views
- admin
- May 16, 2017
- జాతీయం తాజా వార్తలు
చెన్నై: కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు చేపట్టింది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసు దర్యాప్తులో భాగం గా చెన్నైలోని చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ నివాసాలతో పాటు చెన్నైలో మొత్తం 14 చోట్ల దాడులు నిర్వహిస్తోంది.
ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం, ఆయన కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసు లో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఐటీశాఖ పలు సార్లు చిదంబరం నివాసాలపై దాడులు చేపట్టింది. ఈ కేసులో చిదం బరం పాత్రపై నివేదిక కూడా రూపొందిస్తున్నట్లు ఇటీవల ఐటీశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసులో చిదంబరంపై విచారణ చేపట్టాల్సిందిగా సీబీఐని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ మేరకు నేడు సీబీఐ సోదాలు చేపట్టింది. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఒప్పందానికి అనుమతించారని భాజపా నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరోవ్కెపు ఈ కుంభకోణంలో చిదంబరం తనయుడు కార్తీ ఓ విదేశీ కంపెనీ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరిపైనా సీబీఐ ద ష్టి పెట్టింది.


