జీఎస్టీ మరో విప్లవాత్మక సంస్కరణ
- 12 Views
- admin
- May 16, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
విపక్షాలు సహకరించాలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం దివంగత నేతలకు నివాళి ప్రారంభంలోనే ఆందోళనకు దిగిన వైసీపీ
స్పీకర్ను చుట్టుముట్టిన వైకాపా ఎమ్మెల్యేలు నిరవధిక వాయిదా
అమరావతి, ఫీచర్స్ ఇండియా: జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి పత్రిపక్షం సహక రించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదిస్తున్నాయనీ, మనం కూడా ఆమో దిద్దామని చెప్పారు.
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సమావేశం ప్రారంభమైన వెంటనే దివంగత నేతలు దేవినేని నెహ్రూ, నారాయణరెడ్డిలకు సభ సంతాపం తెలి పింది. అనంతరం జీఎస్టీ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. అయితే, రైతు సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.
స్పీకర్ను చుట్టుముట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు అసెంబ్లీ నేడు ప్రత్యేకం గా సమావేశమైంది.
అయితే రైతు సమస్యలపై చర్చించాల్సిం దేనంటూ వైసీపీ సభ్యులు పట్టుబడుతు న్నారు. అంతేకాదు, స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. వారందరినీ స్పీకర్ వారించే ప్రయత్నం చేశారు.
జీఎస్టీ బిల్లుపై చర్చను కొనసాగనివ్వాలని…
అందరూ వెళ్లి తమ తమ సీట్లలో కూర్చోవాలని సూచించారు. దీంతో, మరిం త రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఏకంగా స్పీకర్నే చుట్టుముట్టారు. ఆయన వెనుక, పక్కన నిలబడి ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళ వాతావరణం నెల కొంది. వైసీపీ సభ్యుల గొడవ మధ్యే జీఎస్టీపై చర్చ
కొనసాగింది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చంద్రబాబు ఆగ్రహం
ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వాయిదా పడిన తరువాత కమిటీ హాల్ లో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముందుగానే వర్తమానం పంపినా అత్యధికులు గైర్హాజరు కావడం పట్ల ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమావేశానికి చంద్రబాబు వచ్చి కూర్చునే సమయానికి చాలా వరకూ కుర్చీలు ఖాళీగా ఉండటం, ఆపై ఒక్కొక్కరూ వస్తుండటంపై అసహనాన్ని వ్యక్తం చేసిన ఆయన, సభ్యల తీరు నచ్చలేదని ఒకింత ఆగ్రహంగానే వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాకపోవడంపై అసంత ప్తిని వ్యక్తం చేసిన చంద్రబాబు, ప్రజా సమస్యల గురించి చర్చిద్దామంటే, స్పందన చూపకపోవడం భావ్యం కాదని వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ఆగ్రహం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరుగు పరుగున కమిటీ హాల్ లోకి వెళ్లడం కనిపించింది.
బయట మద్దతిస్తామంటారు…లోపల గొడవ చేస్తారు! ఇదేం విధానం: విష్ణు కుమార్ రాజు
ఆంధప్రదేశ్ శాసనసభలో వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపట్ల బీజేఎల్పీ నేత విషు?కుమార్ రాజు తీవ్రఅసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్వహించిన ఏపీ శాసనసభలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టిన సందఠంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన విష్ణుకుమార్ రాజు…వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల తీరును ఖండించారు. సభబయట జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలుపుతామంటారు…సభ లోపల బిల్లుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు…ఏంటీ విధానం? అంటూ ప్రశ్నించారు. ఈ తీరు మార్చుకోవాలని, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రాష్ట్రం, దేశ ప్రయోజనాలకోసం తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.
రైతుల సమస్యలను తీరుస్తున్నందుకు సభను స్తంభింపజేస్తారా?: జగన్కు లోకేశ్ సూటి ప్రశ్న
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివ ద్ధి, ఐటీ శాఖామంత్రి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. శాసనసభను స్తంభింపజేస్తామన్న ఆయన వ్యాఖ్యలను తప్పబట్టారు. జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించింది ఒకటైతే ప్రజలకు చెప్పింది మరొకటని దుయ్యబట్టారు. రైతుల సమస్యలను తీరుస్తున్నందుకు జగన్ శాసనసభను స్తంభింపజేస్తారా? అని లోకేశ్ ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లోనూ మిర్చి, పసుపు రైతులకు అంతంత మాత్రంగా చెల్లిస్తుంటే, ఏపీలో మిర్చి, పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకున్న విషయాన్ని జగన్ మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు.
వీపీ సింధుకు ఉప కలెక్టర్ ఉద్యోగం
ప్రజాసేవల చట్ట సవరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా ఈ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఒలింపిక్స్లో సింధు అద్భుత ప్రతిభ చూపిందని కొనియాడారు. దీంతో ఆమెను ఉపకలెక్టర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని.. తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లును ఆమోదం తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.


