నారపాడులో భారీ అగ్ని ప్రమాదం
- 19 Views
- admin
- May 16, 2017
- తాజా వార్తలు స్థానికం
సబ్బవరం, ఫీచర్స్ ఇండియా : మండలంలోని మారుమూల గ్రామం నారపా డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మి ది పూరిళ్లు అగ్నికి ఆహుతవగా, సుమారు రూ.10 లక్షలు ఆస్థి నష్టం వాటిల్లింది. సర్వం కాలి బూడిదవడంతో ఆ పేద కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఈ సంఘటనకు సంబంధించి వీఆర్వో టీ రామకోట అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. నారపాడు గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన 10కుటుం బాలు ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెలలో నివసిస్తు న్నాయి. ఎప్పటి లాగే కూలీ చేసుకునేందుకు ఇంటి నుండి వారు బయటకు వెళ్లారు. మధ్యా హ్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్ట వశాత్తూ ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ప్రణాపా యం తప్పింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. తొమ్మిది ఇళ్లలోని టీవీ, బట్టలు, బంగారు ఆభరణాలు అన్నీ కాలి బూడిదయ్యాయి. తొమ్మిది మేకలు చనిపోయా యి. కళ్లెదుటే సర్వం కోల్పోవటంతో తాము రోడ్డునపడ్డామని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలిం చిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెనుమత్స వేణుగోపా ల్రాజు, తక్షణ సహాయం కింద బాధిత కుటుం బాలకు ఒక్కొక్కరికి 10కిలోల బియ్యాన్ని పంపిణీ చేసినట్లు వీఆర్వో అప్పారావు తెలిపారు. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను టీడీపీ నాయకులు, ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఉత్తరాంధ్ర అధ్యక్షులు భరణికాన సాయినాథరావు పరామ ర్శించారు. వారికి ఆర్ధిక సాయంగా వంట పాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లా తాతారావు, మాజీ ఎంపిటీసీ కోరాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఆర్ఇఎస్ ఛైర్మన్ కొటాన అప్పారావు బాధితులకు బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సహకారంతో బాధిత కుటుంబాలకు సాయాన్ని తక్షనం అందజే యడంతో పాటు పక్కా ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, కోరాడ శ్రీనివాసరావు, కే రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.