
తన రోల్లో తానే కనిపించాలని డైరెక్టర్ అడిగినా.. మొదట్లో నో చెప్పానని సచిన్ చెప్పాడు. మొదట్లో నా వల్ల కాదని చెప్పాను. నేను నటించలేను. నేనో క్రీడాకారున్ని, నటున్ని కాను అన్నాను. నన్ను ఒప్పించడానికి వాళ్లు చాలా ప్రయత్నించారు. అయితే నా జీవితంలో జరిగిన ఘటనలనే తెరకెక్కిస్తున్నారు. కెరీర్లో క్లిష్ట సమయాల్లో నేను ఎలా ఫీలయ్యానో నాకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. అందుకే నేనే నటించాల్సి వచ్చింది అని సచిన్ తెలిపాడు. ఈ సినిమా మే 26న రిలీజ్ కాబోతున్నది.