సింగపూర్ ఫ్లీట్ రివ్యూలో ఇండియన్ నేవీ
- 10 Views
- admin
- May 16, 2017
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: సింగపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ మారిటైం రివ్యూలో భారత యుద్ధ నౌకలు విజయవంతంగా పాల్గొన్నాయి. రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ (ఆర్.ఎస్.ఎస్.) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని సింగపూర్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ నావికాదళ విన్యాసాన్ని ఏర్పాటు చేసింది. ఈ రివ్యూలో 21 దేశాలకు చెందిన 46 యుద్ధ నౌకలు, నాలుగు హెలికాఫ్టర్లు పాల్గొన్నాయి. ల్యాండ్ రివ్యూ, సీ రివ్యూ ఈ రెండు విభాగాలలో సమీక్ష జరిగింది. సింగపూర్ అధ్యక్షుడు టోనీ టాన్ కెంగీ యాం ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. ఐఎన్ఎస్ సహ్యాద్రి నౌక ల్యాండ్ రివ్యూలో, ఐఎన్ఎస్. కమోర్జా సీ రివ్యూలో పాల్గొన్నాయి. ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకే ఈ ఫ్లీట్ రివ్యూ నిర్వహించినట్లు ఆ దేశాధ్యక్షుడు తెలిపారు.
Categories

Recent Posts

