సీజన్ క్రషింగ్ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
- 23 Views
- admin
- May 16, 2017
- తాజా వార్తలు స్థానికం
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: తుమ్మ పాల చక్కెర కర్మాగారం ఆధారపడిన రై తాంగాన్ని, కార్మికులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని పలు ప్రజా సంఘాల నాయ కులు కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో భాగంగా సోమవారం జాయింట్ కలెక్టర్ సృజనకు కలెక్టర్ కార్యాలయంలో వినతిప త్రాన్ని సమర్పించారు. 2017-18 సీజన్ క్రషింగ్ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటి నుంచే ఫ్యాక్టరీ ఓవర్ హాలింగ్ పనులు చేపట్టడమే కాక రైతుల నుంచి అగ్రిమెంట్లు కూడా తీసుకోవాలని వారు కోరారు. గతంలో జాయింట్ కలెక్టర్ షుగర్ ఫ్యాక్ట రీని సందర్శించి సమస్యలు తెలుసుకుం టానని పత్రికాముఖంగా చెప్పారన్నారు. ఇప్పటికైనా షుగర్‌ఫ్యాక్టరీని సందర్శించి రైతు, కార్మికుల సమస్యలను తెలుసుకొని వారికి న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై ఆమె స్పందిస్తూ వారం రోజుల్లో ఫ్యాక్టరీని సందర్శిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బీసీ రూరల్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, ప్రజారాజకీయవేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్‌బాబు,సామజిక హక్కుల వేదిక నియోజకవర్గ కన్వీనర్ రాజానా దొరబాబు, బీసీ సంఘం నాయకుడు బొట్టా చిన్నియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షోభంలో ఉన్న మిర్చి రైతులను ఆదుకోవాలి
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవాలని ఆమ్ ఆద్మీపార్టీ కన్వీనర్ కొణతాల హరనాథబాబు డిమాం డ్ చేశారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ప్రతినిధులు ఆర్డీవో ఎంవీ సూర్యకళను కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభు త్వం ఒక ప్రణాళిక ప్రకారం పంట కొను గోలు చేసి రేషన్‌డిపోల ద్వారా, అలాగే ప్రైవేటుగా అమ్మకం కేంద్రాలు ఏర్పాటు చేసి మిర్చి అమ్మకాలను జరిపించాల న్నారు. ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్థులు ఒక్కొక్కరూ పది కేజీలు వంతున కొనుగోలు చేసేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయా లని కోరారు. ప్రతి రాజకీయ నాయకుడు 20 కేజీల మిర్చిని తప్పకుండా కొనుగోలు చేయాలని, రేషన్‌డిపోల ద్వారా ఐదు కేజీల మిర్చి ప్యాకెట్లును ప్రజలకు సరఫరా చేయాలన్నారు. కేజీ మిర్చి వంద రూపా యలు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతుం దని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్ర మంలో మావూరి రవికుమార్, కాలెపు గణేష్‌బాబు, జి.శేఖర్‌రావు, ఆళ్ల వెంకట రావు, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మునగపాకలో అశ్లీల నృత్యాలు
అనకాపల్లి, ఫీచర్స్ ఇండియా : మునగపాక మండలంలో మళ్లీ అశ్లీల నృత్యాల జోరు అందుకుంది. ఈ మండలంలో ఏ గ్రామంలో పండగ అయినా అశ్లీల నృత్యాలు జరగాల్సిందే. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో యధేచ్ఛగా ఈ నృత్యాలు దర్జాగా జరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఈ మండలంలోని వాడ్రాపల్లి, అరబుపాలెం గ్రామాలలో పోలీసుల సాక్షిగా రికార్డింగ్ డ్యాన్స్‌లు జరిగాయి. ఊరికి పొలిమేరలో ఈ అసభ్య నృత్యాలను యువకులు కేరింతలతో ఆస్వాదించారు. దీనిపై మునగపాక ఎస్ఐ స్వామినాయుడును వివరణ అడుగగా తాను విజయవాడలో బందోబస్త్‌లో ఉన్నట్లు చెప్పారు. అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని చెప్పగా ఇందుకు అనుమతులు ఉన్నట్లు చెప్పారు. రికార్డింగ్ డ్యాన్స్‌లను ప్రభుత్వం నిషేదించింది కదా అని చెప్పగా స్టేజ్ ప్రోగ్రామ్ అని డీఎస్పీ వద్ద పర్మిషన్ తీసుకున్నారని, మరి అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదని మాటమార్చారు. విచిత్రమైన విషయమేమంటే గ్రామాలలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించరాదని ప్రతిచోట ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు చెబుతుంటారు. ఈ విషయమై తన వద్దకు రావద్దని చెబుతారు. కాని తెరవెనుక మాత్రం సూపర్ ఎమ్మెల్యేగా ముద్రపడ్డ పంచకర్ల అనుచరుడే చక్రం తిప్పుతుండడం విశేషం. గ్రామాలలో అశ్లీల నృత్యాలతో పాటు లాటరీ బల్లలు కూడా గ్రామాలలో జోరుగానే సాగుతున్నాయి. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ముసుగులో ఇటువంటి అశ్లీల నృత్యాలు ప్రదర్శించే బదులు రికార్డింగ్ డ్యాన్స్‌లకు అనుమతులు ఇచ్చేస్తే కనీసం పేద కళాకారిణులైనా బ్రతుకుతారు కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నూతన కార్యవర్గం
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: అనకాపల్లి జీవీఎంసీ జోన్ కాంట్రాక్టర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా యర్రంశెట్టి వెంకటరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక కోడుగంటి గోవిందరావు భవనంలో మంగళవారం వడ్డాది పోలరావు అధ్యక్షతన ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షులుగా యర్రం శెట్టి సత్యనారాయణ, కార్యదర్శిగా గండ్రెటి అప్పారావు, సహాయ కార్యదర్శిగా యర్రంశెట్టి శ్రీనివాసరావు, వడ్డాది వెంకట అప్పారావు, కోశాధికారిగా బండి చిననూకరాజు ఎన్నికయ్యారు. సభ్యులుగా సోమాదుల త్రినాథ్, గూడెపు సత్తిబాబు, యర్రంశెట్టి పోలేంద్ర, బూడి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ కమిటీకి గౌరవాధ్యక్షునిగా కోన లక్ష్మణ, ముఖ్యసలహాదారునిగా యర్రంశెట్టి అరుణ్‌కుమార్, సోమాదుల ఈశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: ఇక్కడికి సమీపంలోని కొప్పాక బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందిన సంఘటన తెలియవచ్చింది. అనకాపల్లి పల్లపువీధికి చెందిన కొణతాల గణేష్ (22) అనే యువకుడు తన స్నేహితునితో కలిసి మోటార్‌బైక్‌పై సోమవారం తెల్లవారుజామున కొప్పాక వైపు నుంచి అనకాపల్లి వస్తుండగా డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ వీరు ఎన్టీఆర్ వైద్యా లయంలో చికిత్స పొందారు. వీరిలో గణేష్ నడుమకు బలమైన గాయం కావడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
చెడును నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: ప్రజలతో సత్సంబంధాలు ఉన్నప్పుడే ఏ సంస్థ అయినా సమర్థవంతంగా పనిచేయ గలదని అనకాపల్లి డిఎస్పీ అన్నెపు పురు షోత్తం అన్నారు. పట్టణ పోలీసుస్టేషన్ ఆవరణలో సోమవారం సాయంత్రం కమ్యూ నిటీ పోలీసింగ్‌పై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో చెడును నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ముందు కు రావాలని ఆయన అన్నారు.సమాజాన్ని పరిరక్షించేందుకు విద్యార్థులు కూడా బాధ్యత వహించాలని ఆయన అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ప్రజల కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని అవసరమనుకుంటే తమ జీవితాలు కూడా త్యాగం చేయడానికి సిద్ధమేనన్నారు. ఆటో డ్రైవర్లు నిబంధనల ప్రకారం ఆటోలు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానా లకు చేర్చాలన్నారు. పట్టణ సీఐ విద్యాసా గర్ మాట్లాడుతూ ప్రజల సహకారం లేనిదే ఏ పని చేయలేమని ప్రజా సహకా రంతోనే సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. చోడవరం రోడ్డులో స్థానిక జార్జిక్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వలన పలు సంఘటనల్లో నేరస్థులను పట్టుకోగలిగామ న్నారు. పోలీసు విధుల్లో ప్రజలను కూడా సంఘటితం చేయడమే సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బొలిశెట్టి శ్రీనివాసరావు, జార్జిక్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కొణతాల మురళీకృష్ణ, మళ్ల సూరిబాబు, డీవీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ కోరుబిల్లి రమేష్, బీసీ సంఘం నాయకులు బొట్టా చిన్నియాదవ్, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు.
గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్త వహించాలి
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: వేసవి కారణంగా గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో పీవీ రమణ ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షిత మంచినీటి ట్యాంకర్లను ఎప్పటికప్పుడు శుద్ధి చేయాలన్నారు. అంతేకాకుండా పారిశుధ్యం పట్ల కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. పంచాయతీల వారీగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కార్యదర్శులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్ర భవనాలు, పంచా యతీ భవనాలు నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఈవోపీఆర్డీ జి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


