‘జబర్దస్త్’కి ఝలక్.. ఆపేయాలంటూ ఫిర్యాదు!
- 17 Views
- admin
- May 17, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం సినిమా

జబర్దస్త్‌లో హైపర్ ఆది షో
ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో ‘జబర్దస్త్’ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈ కార్యక్రమం ప్రసారాన్ని వెంటనే ఆపేయాలని కోరుతూ హైదాబాద్‌లోని బాలానగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మహిళలు, చిన్న పిల్లల్ని కించపరిచేలా ‘జబర్దస్త్’లో కొన్ని దృశ్యాలను ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
‘జబర్దస్త్’ కార్యక్రమంలోని కొన్ని ఎపిసోడ్లలో అనైతిక దృశ్యాలు.. అసంబంధ, అశ్లీల పదాలను ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిని ఆ ఈటీవీ యాజమాన్యం కాని, ప్రోగ్రాం డైరెక్టర్ కానీ సెన్సార్ చేయడంలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమం ప్రసారమయ్యేందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని బాలానగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు మానవ హక్కుల సంఘంలోనూ దివాకర్ ఫిర్యాదు చేశారు.

Categories

Recent Posts